Sunday, May 19, 2024

ఫ్రాన్స్‌లో కూలిన హెలికాప్టర్: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Five died after Helicopter collapsed in France

ప్యారిస్: ఫ్రెంచ్ ఆల్ప్(పర్వత శ్రేణులలో)లో మంగళవారం సాయంత్రం ఒక హెలికాప్టర్ కూలిపోయి సహాయక బృందానికి చెందిన ఐదుగురు సభ్యులు మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సవోయి ప్రాంతంలో శిక్షణ కోసం వీరంతా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పర్వత ప్రాంతంలో హెలికాప్టర్ 1800 మీటర్ల(5,905 అడుగులు) ఎత్తు నుంచి కూలిపోయిందని అధికారిక ప్రకటన తెలిపింది. గాయపడిన వ్యక్తి గ్రెనోబుల్ నగరంలోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇతరుల ప్రాణాలను రక్షించే వారే తమ ప్రాణాలు కోల్పోవడం విచారకరమని పేర్కొంటూ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మాక్రన్ ట్వీట్ చేశారు.

Five died after Helicopter collapsed in France

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News