Saturday, May 4, 2024

పాతబస్తీలో ఫ్లాగ్ మార్చ్

- Advertisement -
- Advertisement -

Flag March in Old City for inspire courage in voters

 

నగర సిపి అంజనీకుమార్
1,000మంది భద్రతా సిబ్బంది
ఓటర్లలో ధైర్యం నింపేందుకే ఫ్లాగ్ మార్చ్
హైదరాబాద్ సిపి అంజనీకుమార్

మనతెలంగాణ, హైదరాబాద్ : ఓటర్లలో ధైర్యం నింపేందుకే ఫ్లాగ్ మార్చ్ చేపట్టామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. చార్మినార్ వద్ద నగర పోలీసులు బుధవారం ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. కార్యక్రమంలో నగర అదనపు పోలీస్ కమిషనర్ శిఖాగోయల్, అదనపు పోలీస్ కమిషనర్ లా అండ్ ఆర్డర్ డిఎస్ చౌహాన్, జాయింట్ సిపి ఎస్‌బి తరుణ్ జోషి, సౌత్‌జోన్ డిసిపి గజారావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని నగర సిపి అంజనీకుమార్ తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల్లో భద్రతను ఎక్కువగా పెట్టామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలని కోరారు. ఫ్లాగ్ మార్చ్ చార్మినార్, రాజేష్ మెడికల్ హాల్, నాగుల్‌చింత ఎక్స్ రోడ్డు, సుధా లైబ్రరీ, హరిబౌలి, వోల్టా, ఎత్‌బార్ చౌక్, గుల్జార్ హౌస్, చార్మినార్ ప్రాంతాల్లో నిర్వహించారు. ఫ్లాగ్ మార్చ్‌లో 1,000మంది పోలీసులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News