Monday, May 6, 2024

కరోనా నివారణకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

- Advertisement -
- Advertisement -
Central Govt issues new COVID-19 guidelines
జోన్ల వెలుపల లాక్‌డౌన్‌కు కేంద్రం అనుమతి తప్పనిసరి

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. డిసెంబర్ 1 నుంచి 31 వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేయాల్సిన నిబంధనలను బుధవారం వెల్లడించింది. కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల లాక్‌డౌన్‌కు కేంద్ర అనుమతి తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్ జోన్లలో అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే అనుమతించింది. కంటైన్‌మెంట్ జోన్లలో నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులు, జిల్లా యంత్రాంగానిదేనని స్పష్టం చేసింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా రాత్రిపూట కర్ఫూ వంటి నిబంధనలు రాష్ట్రాలు విధించుకోవచ్చని కేంద్ర హోంశాఖ తెలియచేసింది.

మాస్క్‌లు ధరించకుంటే జరిమానా

నిబంధనలు పాటింప చేయడంలో ప్రజలను మరింత చైతన్యం కలిగించాలని నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకోవాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించని వారికి తగిన జరిమానా విధించాలని సూచించింది. కంటోన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు కేంద్రం అనుమతించింది. అంతర్జాతీయ ప్రయాణికులను కేంద్రహోం శాఖ నిబంధనల ప్రకారం అనుమతించాలని సూచించింది 50 శాతం సామర్థంతో సినియా థియేటర్లు తెరవవచ్చని, క్రీడాకారుల శిక్షణ కోసం మాత్రమే స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతించాలని, సామాజిక , ఆధ్యాత్మిక, క్రీడా, వినోద , విద్య, సాంస్కృతిక, మతపర మైన కార్యక్రమాలకు 50 శాతం సామర్థంతో హాలు లోకి అనుమతించాలని, ఇతర కార్యక్రమాలకు 200 మందికి మించరాదని స్పష్టం చేసింది. రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ఆరోగ్యసేతు యాప్ వాడకాన్ని ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News