Friday, April 26, 2024

క్రెడిట్ స్కోర్ గుడ్డిగా నమ్మొద్దు

- Advertisement -
- Advertisement -

Nirmala-Sitharaman

కస్టమర్లతో బ్రాంచ్‌ల స్థాయిలో టచ్‌లో ఉండాలి
బ్యాంకులకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచన

న్యూఢిల్లీ: రుణగ్రస్తుల క్రెడిట్ స్కోర్‌ను గుడ్డిగా నమ్మొద్దని బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వరంగ బ్యాంకులను హెచ్చరించారు. కస్టమర్లతో బ్రాంచ్‌ల స్థాయిలో మెరుగుదల మీద దృష్టిపెట్టాలని సూచించారు. కొత్త టెక్నాలజీని విస్తరించడమే లక్షంగా ప్రభుత్వరంగ బ్యాంకుల కోసం చేపట్టిన కొత్త సంస్కరణలను ప్రారంభించిన సందర్భంగా సీతారామన్ ఈవిధంగా అన్నారు. బ్రాంచ్ స్థాయిలో కస్టమర్లతో సంబంధాలు ఇప్పటివరకు లేవని, బ్యాంకుల బ్రాంచ్‌లకు వెళ్లాలని, వ్యక్తిగతంగా వారితో టచ్‌లో ఉండాలని కస్టమర్లు కోరుకుంటామని ఆమె అన్నారు.

రుణగ్రస్తుల గురించి తెలుసుకునేందుకు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలనే ప్రమాణికంగా తీసుకోరాదని, అది ఒక్కటే ఇండికేటర్ కాదని అన్నారు. ‘మీరు టెక్నాలజీని వినియోగించుకోవాలి. కానీ రేటింగ్ ఏజెన్సీలను గుడ్డిగా అనుసరించవద్దు. వ్యక్తిగత స్థాయిలో వారిని అంచనా వేయడం లేదు’ అని నిర్మల అన్నారు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలను గుడ్డిగా నమ్మమని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని అన్నారు. బ్రాంచ్‌ల స్థాయిలో సిబ్బంది సమస్యలను వినాలను టాప్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌లకు ఆర్థికమంత్రి సూచించారు.

FM warns banks against trusting credit score

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News