Wednesday, May 8, 2024

అమిత్ షాను తప్పించండి

- Advertisement -
- Advertisement -

Sonia-Gandhi

సోనియా ఆధ్వర్యంలో రాష్ట్రపతికి విజ్ఙప్తి చేసిన కాంగ్రెస్ బృందం

న్యూఢిల్లీ : ఢిల్లీ ఘర్షణల నివారణలో వైఫల్యం చెందిన హోం మంత్రి అమిత్ షా రాజీనామాకు ఆదేశించాలని రాష్ట్రపతికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. గురువారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. ఘర్షణల నివారణలో కేంద్రం తమ రాజధర్మాన్ని విస్మరించిందని కాంగ్రెస్ తెలిపింది. ఢిల్లీలో మత ఘర్షణల దశలో అమిత్ షా తన విద్యుక్త ధర్మాన్ని పాటించలేదని పార్టీ తెలిపింది. వెంటనే హోం మంత్రి రాజీనామాకు ఆదేశాలు వెలువరించాల్సి ఉందని పేర్కొంది.

సోనియాతో పాటు ఈ ప్రతినిధి బృందంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్, కెసి వేణుగోపాల్, మాజీ మంత్రి చిదంబరం , ప్రియాంక గాంధీ ఇతరులు ఉన్నారు. దేశ రాజధానిలో హింసాకాండపై రాష్ట్రపతికి ఈ ప్రతినిధి బృందం ఒక విజ్ఞాపన పత్రం సమర్పించింది. రాష్ట్రపతిని కలిసిన తరువాత సోనియా గాంధీ అక్కడున్న విలేకరులతో మాట్లాడారు. పరిస్థితి దిగజారుతూ ఉంటే, కేంద్రం, ఆప్ ప్రభుత్వం పరస్పరం విమర్శించుకుంటూ ప్రేక్షక పాత్ర వహించాయని ఆమె విమర్శించారు. పరిస్థితిని అదుపులో పెట్టడంలో కేంద్రం పూర్తిగా విఫలం చెందిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. కేంద్రానికి సరైన రాజధర్మాన్ని రాష్ట్రపతి తెలియచేయాల్సి ఉందని పార్టీ తెలిపింది.

32కు చేరిన ఢిల్లీ మృతుల సంఖ్య

పౌరచట్టంపై రగిలిన ఢిల్లీలో మతఘర్షణలు తలెత్తి జరిగిన హింసాకాండలో మృతుల సంఖ్య 32కు చేరింది. ఈ విషయాన్ని సీనియర్ అధికారులు గురువారం తెలిపారు. బుధవారం రాత్రి వరకూ మృతుల సంఖ్య 27 గా ఉంది. అయితే తీవ్రస్థాయిలో గాయపడ్డ వారిలో కొందరు తరువాత మృతి చెందారు. జిటిబి ఆసుపత్రిలో మృతుల కేసులు నమోదు అయ్యాయి,

Sonia Gandhi met President Ram Nath Kovind

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News