Friday, April 26, 2024

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

- Advertisement -
- Advertisement -

Foreign currency Seized at Shamshabad Airport

హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తుండగా బుధవారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇండిగో 6ఈ1405 ద్వారా షార్జా వెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి కస్టమ్స్ తీసుకున్నారు. అతని నుంచి 25వేల సౌదీ అరేబియా రియాల్స్, 22,500 యూఏఈ దిర్హామ్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం కరెన్సీ విలువ భారత కరెన్సీలో రూ.8లక్షలకుపైగా ఉంటదని, సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News