Wednesday, May 1, 2024

విదేశీ మదుపరులు భారతీయ ఈక్విటీల్లో రూ.44,500 కోట్లు పెట్టారు

- Advertisement -
- Advertisement -
Sensex
Sensex

న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు(ఎఫ్‌పిఐ)ల నిరంతర కొనుగోళ్ల కారణంగా ఈక్విటీ మార్కెట్‌లో సెంటిమెంట్లు బుల్లిష్‌గా మారాయి.గత నెలలో నికర కొనుగోలుదారులుగా విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీల పట్ల విపరీతమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు, అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గడం, డాలర్ ఇండెక్స్ పడిపోవడంతో ఆగస్ట్‌లో ఇప్పటివరకు రూ. 44,500 కోట్ల వరకు  పెట్టుబడులు పెట్టారు. మొత్తం జూలైలో ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐలు) చేసిన దాదాపురూ. 5,000 కోట్ల నికర పెట్టుబడి కంటే ఇది చాలా ఎక్కువ అని డిపాజిటరీల డేటా వెల్లడించింది.

గత ఏడాది అక్టోబరులో ప్రారంభమైన వరుసగా తొమ్మిది నెలల భారీ అవుట్‌ఫ్లోల తర్వాత ఎఫ్‌పిఐలు మొదటిసారిగా జూలైలో నికర కొనుగోలుదారులుగా మారారు. అక్టోబర్ 2021 నుండి జూన్ 2022 మధ్య, వారు భారతీయ ఈక్విటీ మార్కెట్‌లలో భారీగా రూ. 2.46 లక్షల కోట్ల మేరకు షేర్లను విక్రయించారు. రాబోయే నెలల్లో,ఎఫ్‌పిఐ ప్రవాహాలు అస్థిరంగా ఉంటాయి. అయితే, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ద్రవ్య విధానం కఠినతరం , మొదటి త్రైమాసిక ఆదాయాల పనితీరు వంటి మసకబారిన ఆందోళనలతో, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఇన్‌ఫ్లోలు మెరుగుపడే అవకాశం ఉందని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. మూలధన ప్రవాహాలలో సమీప-కాల ధోరణి ప్రధానంగా డాలర్ యొక్క కదలిక ద్వారా ప్రభావితమవుతుందని  జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె. విజయకుమార్ తెలిపారు.

ఎఫ్‌పిఐల నిరంతర కొనుగోళ్ల కారణంగా ఈక్విటీ మార్కెట్‌లో సెంటిమెంట్లు బుల్లిష్‌గా మారాయి. మార్నింగ్‌స్టార్ ఇండియా, అసోసియేట్ డైరెక్టర్ – మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ మాట్లాడుతూ, యుఎస్ మార్కెట్‌ను తాకగలదని భావిస్తున్న మాంద్యం( the recession) కార్యరూపం దాల్చకపోవచ్చు లేదా దాని ప్రభావం తక్కువగా ఉంటుందని అంచనా వేయడం వల్ల నికర ఇన్‌ఫ్లోలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం భారతదేశంతో పాటు, ఇండోనేషియా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌లలో పెట్టుబడి ప్రవాహాలు సానుకూలంగా ఉండగా, ఫిలిప్పీన్స్, తైవాన్‌లలో మాత్రం ప్రతికూలంగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News