Friday, April 26, 2024

నాలుగు నెలల పాటు ఉచిత బియ్యంతో పేదలకు ఊరట

- Advertisement -
- Advertisement -

డిసెంబర్ నుంచి మార్చి వరకు పంపిణీపై నగరవాసుల హర్షం
గత ఏడు నెలల నుంచి మూడు పుటలా భోజనం చేస్తున్నామని వెల్లడి
కొత్త డీలర్లను నియమించాలని కోరుతున్న డీలర్ సంఘాల నాయకులు

Ration

నగర పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో నాలుగు నెలల పా టు ఉచితంగా రేషన్ బియ్యం పథకం కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. సర్కార్ నిర్ణయం పట్ల పట్టణ బడుగు,బలహీన వర్గాలకు చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. కరోనా కాలంలో పేదల ఇబ్బందులు గమనించిన ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద రేషన్‌కార్డులోని ప్రతి వ్యక్తికి 10కిలోల చొప్పున మార్చి నుంచి నవంబర్ వరకు బియ్యం అందజేసింది. అ దే తరహాలో డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఈపథకం ద్వారా ఉచితంగా రేషన్ ఇస్తామని పేర్కొంది. దీంతో ఈపథకం ఏడాది పాటు కొనసాగిస్తునట్లు పౌరసరఫరాల అధికారులు పేర్కొంటున్నారు.

మన తెలంగాణ/సిటీబ్యూరో: రేషన్ బియ్యం రాష్ట్ర ప్రభుత్వం 6 కేజీలు, కేంద్ర సర్కార్ 5 కేజీలు అందజేస్తుంది. గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో 6,10,866 ఆహార భద్రత కార్డులు, రంగారెడ్డి 6,55,957 కార్డులు, మేడ్చల్ జి ల్లాలో 5,24, 594 కార్డులకు ప్రతినెలా ఉచిత బియ్యం రేషన్ డీలర్లు పంపిణీ చేస్తున్నారు. గతంలో మాదిరిగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉచిత బియ్యం లబ్దిదారులకు పంపిణీ చేస్తామని, బయోమెట్రిక్ మిషన్లు మొరాయింపు, ఓటిపి విధానంతో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని, ప్రభుత్వం థర్డ్‌పార్టీ విధానం తీసుకరావాలని కోరుతున్నారు. అదే విధంగా మహమ్మారి సోకి కొంతమంది డీలర్లు చనిపోవడంతో వారి స్దానంలో కొత్తవారిని నియమించకపోవడంతో ప్రతినెలా 800లకు పైగా కార్డులకు సరుకులు పంపిణీ చేయడం భారంగా మారందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్తీలు, కాలనీల్లో కొంత మంది దళారులు ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యం కొనుగోలు చేస్తూ అమాయక ప్రజలను మోసం చేసి సొమ్ము చేసుకుంటారని వారిపట్ల ప్రజలు జాగ్రత్తం గా ఉండాలని సూచిస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు బ్లాక్ మా ర్కెట్ పేరుతో తమను ఇబ్బందులు గురిచేస్తూ రేషన్ పంపిణీ చేయకుండా కుట్రలకు పాల్పడుతున్నారని వెల్లడిస్తున్నారు. ఉచితంగా పంపిణీ చేసినప్పటికి నుంచి లబ్దిదారులంతా ప్రతి నెలా ఖచ్చితంగా బి య్యం తీసుకుంటున్నారని, ఎక్కువమంది సన్నబియ్యం తీసుకోవడానికి ఇష్ట పడుతున్నారు. దొడ్డు తినలేక పోతున్నామని, ప్రతి నెలా నాణ్యమైన బియ్యం వచ్చేలా చూడాలని కోరుతున్నట్లు డీలర్లు పేర్కొంటున్నారు. ఉచిత రేషన్‌బియ్యం పథకంతో కడుపునిండా మూడు పుటలు భో జనం చేస్తున్నామని పలువురు కార్డుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News