Friday, May 3, 2024

ఫ్రాన్స్ బిలియనీరు ఒలివిర్ దుర్మరణం

- Advertisement -
- Advertisement -

French billionaire MP Olivier Dassault dies in Helicopter crash

 

పారిస్ : ఫ్రాన్స్‌కు చెందిన బిలియనీరు, రాజకీయ నాయకుడు ఒలివిర్ డసౌల్ట్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరున్న సెర్గె డసౌల్ట్ పెద్ద కుమారుడు అయిన ఒలివిర్ (69 ఏండ్లు) 2002 నుంచి లెస్ రిపబ్లికన్ పార్టీ ఎంపిగా ఉంటూ వస్తున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో డసౌల్ట్ 361వ స్థానంలో ఉన్నారు. డసౌల్ట్ కుటుంబం పేరిటనే ఓ వైమానిక సంస్థ ఉంది. రాఫెల్ యుద్ధ విమానాల తయారీలో ఉన్న ఈ కంపెనీతోనే భారతదేశం రాఫెల్ విమానాల ఒప్పందం కుదుర్చుకుంది. డసౌల్ట్ కుటుంబానికి లె ఫిగారో పత్రిక కూడా ఉంది. ఆదివారం నార్మన్‌డిలో ఈ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలిందని పోలీసులు తెలిపారు. ఒలివిర్‌కు ఇక్కడ ఓ హాలీడే హోం ఉంది. తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్‌కు జరిగిన ప్రమాదంలో పైలెట్ కూడా దుర్మరణం చెందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News