Friday, April 26, 2024

తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కాలికట్ నుంచి డమ్మమ్ వెళుతున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌‌‌రరపెస్ విమానంలో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ ఏర్పడిందన్న అనుమానంతో విమానాన్ని కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయానికి మళించిన సందర్భంగా ఎయిర్‌పోర్టులో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మధ్యాహ్నం 12.15కు విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయినట్లు వర్గాలు తెలిపాయి.

182 మంది ప్రయాణికులున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఐఎక్స్ 385 విమానంలోని వెనుక భాగక్శుక్రవారం ఉదయం కాలికట్ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి టేకాఫ్ అయిన సమయంలో రన్‌వేను ఢీకొందని వర్గాలు తెలిపాయి. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా విమానంలోని ఇంధనాన్ని అరేబియా సముద్రంలో పారబోసి తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండ్ చేసినట్లు వారు చెప్పారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో పూర్తి స్థాయిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News