Monday, May 6, 2024

కొవాగ్జిన్‌కు డబ్లుహెచ్‌ఒ క్లియరెన్సు మరింత జాప్యం ?

- Advertisement -
- Advertisement -

Further delay in WHO clearance for Covaxin

న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతి పొందడంలో మరింత జాప్యం కావచ్చని తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి సాంకేతిక పరమైన అంశాలపై భారత్ బయోటెక్ నుంచి ప్రపంచ ఆరోగ్యసంస్థ సమాధానాలు ఆశిస్తోంది. అత్యవసర వినియోగ అనుమతి దక్కక పోవడం వల్ల అనేక దేశాలు కొవాగ్జిన్ టీకాను గుర్తించడం లేదు. దీనివల్ల భారతీయులపై ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణాలు చేసే విద్యార్థులకు మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు. టీకాకు సంబంధించిన అన్నిరకాల డేటాను డబ్లుహెచ్‌వొకు సమర్పించామని భారత్ బయోటెక్ చెబుతుండగా, త్వరలోనే అనుమతి వస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి చెబుతున్నారు. అయితే డబ్లుహెచ్‌ఒ వర్గాల నుంచి ఇంకా సమాధానాలు కావాలని కోరడం గమనార్హం. కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ డేటా ప్రకారం ఈ వ్యాక్సిన్ 77.8 శాతం సామర్ధంతో పనిచేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News