Sunday, April 28, 2024

గాంధీ ఆస్పత్రిలో రేపటి నుంచి ప్లాస్మాథెరపీ

- Advertisement -
- Advertisement -

Gandhi-Hospital

హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి ప్లాస్మా థెరిపీ చికిత్స అందించేందుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. కరోనా నుంచి కోలుకున్న 15మంది ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. గాంధీ వైద్యులు వారి నుంచి రక్తం సేకరించనున్నారు. వైద్యులు ఒక్కొక్కరి నుంచి 400 ఎంఎల్ రక్తాన్ని సేకరించి ప్లాస్మాను వేరు చేస్తారు. ఇందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టే అవకాశముంటుంది. ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మా థెరిపీ తీసుకునేందుకు అర్హులైన కోవిడ్ రోగులు ఐదుగురు మాత్రమే ఉన్నట్టు సమాచారం. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న 200 ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Gandhi hospital to start plasma therapy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News