Sunday, May 5, 2024

గాంధీ ముని మనుమడు కరోనాతో కన్నుమూత

- Advertisement -
- Advertisement -

జోహెన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికా దేశం జోహెన్నెస్‌బర్గ్‌లోని మహాత్మ గాంధీ ముని మునిమడు కరోనా వైరస్ సోకి కన్నుమూశాడు. గత నెల రోజుల క్రితం సతీష్ ధూపేలియాకు న్యూమోనియా రావడంతో స్థానిక ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా కరోనా వైరస్ సోకింది. శ్వాస సంబందమైన సమస్యలు రావడంతో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటుండగా సతీష్ తుది శ్వాస విడిచారు. మూడు రోజుల క్రితమే 66వ పుట్టిన రోజులు ఆయన మిత్రులు, బంధువులు జరిపారు. మహాత్మ గాంధీకి సతీష్ దూపేలియా, ఉమా ధూపేలియా, కీర్తిమీనన్ మనీలాల్ వారసులు. సతీష్ మీడియాలో పని చేస్తూనే మహాత్ముడు ప్రారంభించిన పనుల నిర్వహణ కోసం గాంధీ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాడు. ఈ ట్రస్ట్ ద్వారా నిరు పేదలకు సహాయం చేశాడు. సతీష్ గొప్ప మనవతావాది, రాజకీయ విశ్లేషకుడు అని లుబ్నా నద్వి తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News