Sunday, May 12, 2024

గంగమ్మ గంగమ్మ మాయమ్మ…

- Advertisement -
- Advertisement -

నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘జెట్టి‘. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. కార్తీక్ కొడకండ్ల సంగీతాన్ని అందించిన ‘జెట్టి‘ సినిమాలోని ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్నారు చిత్ర బృందం. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రాసిన ‘గంగమ్మ గంగమ్మ మాయమ్మ..’ అనే పాట లిరికల్ వీడియో సాంగ్‌ను ఆయనే స్వయంగా విడుదల చేశారు. ఈ పాటను కార్తీక్ కొడకండ్ల మ్యూజిక్ కంపోజిషన్ లో అనురాగ్ కులకర్ణి ఆలపించారు. గంగపుత్రుల జీవన విధానాన్ని, గంగమ్మ తల్లి ఆదరణకు సజీవ శిల్పం ఈ పాట. మత్య్సకారుల జీవన విధానాలను, వారి కట్టుబాట్లను, ఇప్పటి వరకూ వెండితెరమీద కనిపించని జీవితాలను తెరమీద హృద్యంగా తీసుకురాబోతున్నాడు దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక.

 

‘Gangamma Gangamma..’ lyrical song released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News