Wednesday, May 1, 2024

బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ఢాకా : బంగ్లాదేశ్ లో 12 వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. దాదాపు 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తూ బిఎన్‌పి బంద్‌కు పిలుపు ఇవ్వడంతో అనేక హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే ప్రధాన విపక్షం ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో నాలుగోసారి షేక్ హసీనా నేతృత్వం లోని అవామీ లీగ్‌పార్టీ గెలుస్తుందన్న రాజకీయ ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి.

ఆదివారం ప్రధాన మంత్రి షేక్ హసీనా ఢాకాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశాభివృద్ధికి ప్రజాస్వామ్యం కీలక మని వ్యాఖ్యానించారు. సుదీర్ఘంగా 2009 నుంచి 2023 వరకు తాము అధికారంలో ఉండడం వల్లనే బంగ్లాదేశ్ ఈ స్థాయికి చేరుకుందని ఆమె పేర్కొన్నారు. ప్రజలు నిర్భయంగా ఓటేసే వాతావరణం కల్పించామన్నారు.

ఎన్నికలను బహిష్కరించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి)ని ఉగ్రవాద సంస్థగా ఆరోపించారు. ఈ సందర్భంగా భారత్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. “భారత్ వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండడం మా అదృష్టం. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో వారు మాకు అండగా ఉన్నారు. 1975 తర్వాత మా కుటుంబం మొత్తాన్ని కోల్పోయినప్పుడు ఆశ్రయమిచ్చారు. ఈ సందర్భంగా భారత ప్రజలకు నా శుభాకాంక్షలు ” అని హసీనా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News