Tuesday, April 30, 2024

నగరంలో మరమ్మత్తుల వేగం పెంచిన జిహెచ్‌ఎంసి..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జిహెచ్‌ఎంసి సహాయ చర్యలతో పాటు మరమ్మత్తు పనులను మరింత ముమ్మరం చేసింది. ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాలకు నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లపై బౠరీ గుంతలు ఏర్పడడంతోపాటు పలు కాలనీలు, బస్తీల్లో వరద నీరు నిలిచి పోయింది. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడం, చెరువులు, కుంటల నుంచి వరద నీరు ఆగిపోయింది. దీంతో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో బల్దియా ప్రత్యేక చర్యలను చేపట్టింది. ఇప్పటీకే ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డిలు నగరవాసుల పడుతున్న ఇబ్బందులను పరిశీలించారు.

దీంతో వెంటనే వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని సంబంధిత జోనల్ కమీషనర్లతో పాటుఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలో దిగిన జిహెచ్‌ఎంసి చీఫ్ ఇంజనీర్ మొదలు కిందిస్థాయి అధికారుల వరకు వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల గుంతల ప్యాచ్ వర్క్‌లను గుర్తించి వాటి మరమ్మత్తులను చేపట్టారు. ప్రజా రవాణాకు ఇబ్బందులు కలుగకుండా మరమ్మతుల పనులను రాత్రి వేళా పూర్తి చేస్తున్నారు. బుధవారం అంబర్‌పేట్, నారాయణగూడ, హిమాయత్‌ నగర్, బషీర్‌బాగ్ ప్రాంతాల్లో రోడ్లను మేయర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వీటి మరమ్మత్తులు వెంటనే చేపట్టాలన్నా అదేశాల మేరకు గురువారం తెల్లవారు జామలోపు ఈ ప్రాంతాల్లో పనులను పూర్తి చేశారు.

GHMC begins Road Repair works for stop rains

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News