Saturday, May 4, 2024

జిహెచ్‌ఎంసి స్టాండింగ్ కమిటీ సమావేశం

- Advertisement -
- Advertisement -

GHMC Standing Committee Meeting

హైదరాబాద్: గచ్చిబౌలి జంక్షన నుంచి ఓఆర్‌ఆర్ మార్గంలతో ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్ కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని రూ.5.50 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు జిహెచ్‌ఎంసి స్టాండింగ్ కమిటీ సమావేశం తీర్నానించింది. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో గురువారం ఈ ఏడాది చివరి స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 5 తీర్మానాలను ఆమోదించారు. మేయర్ బొంతు రాంమోహ్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ స్టాండింగ్ కమిటీ సభ్యులు గంధం జోత్స, ముద్రబోయిన శ్రీనివాస రావు, మీర్ బాసిత్ అలీ, సామ స్వప్న, సున్నం రాజ్‌మోహన్, మహ్మద్ నజీరుద్దీన్, ముఠా పద్మ నరేష్, కొలను లక్ష్మి, వి.సిందు, సబితా కిషోర్, బైరగోని ధనుంజయభాయ్, ఎ. అరుణతో పాటు జిహెచ్‌ఎంసి అధికారులు పాల్గొన్నారు.

ఆమోదించిన తీర్మానాలు:
  1. గచ్చిబౌలి జంక్షన్ నుంచి ఓఆర్‌ఆర్ మార్గంలో ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్ కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని రూ.5.50 కోట్ల చేపట్టేందుకు ఆమోదం
    2. సీనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్రమోషన్‌ల ద్వారా భర్తీ చేసేందుకు ప్యానెల్ రూపకల్పనకు ఆమోద ముద్ర.
    3.ప్లేయర్ కమ్ కోచ్‌గా ఉన్న మహమమ్ద్ రవూప్ అలీకి స్పోర్ట్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ఆమోదం.
    4. జూనియర్ డాటా బేస్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న కె.జయప్రకాష్‌ను ఎన్నికల విభాగంలో అవుట్ సోర్సింగ్ పద్దతిలో ఉపయోగించుకునే ప్రతిపాదనలకు ఆమోదం.
    5.శానిటరీ జవాన్లకు హెల్ల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతికి ఆమోదం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News