Monday, April 29, 2024

ఇండో-చైనా సరిహద్దు సమీపంలో 100 గ్రామాల అభివృద్ధికి ప్రతిపాదన

- Advertisement -
- Advertisement -

100 Villages develop plan along Indo-China border

డెహ్రాడూన్: భారత్-చైనా సరిహద్దులకు సమీపంలోని సుమారు 100 గ్రామాలలో వలసలను నివారించి, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అంతర్జాతీయ సరిహద్దు అభివృద్ధి కార్యక్రమం కింద ఈ గ్రామాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికను ఉత్తరాఖండ్ ప్రభుత్వం త్వరలోనే కేంద్రానికి పంపుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి సుబోధ్ ఉనియల్ తెలిపారు.
సరిహద్దు జిల్లాలకు చెందిన 11 బ్లాకుల నుంచి సుమారు 100 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందన, వీటిలో నాలుగు బ్లాకులు పిలోరాగఢ్ జిల్లా, చమోలి నుంచి ఒకటి, ఉత్తరకాశి నుంచి మూడు, ఉధమ్ సింగ్ నగర్ నుంచి ఒకటి, చంపావత్ జిల్లా నుంచి రెండు బ్లాకులు ఉన్నాయని ఆయన వివరించారు.

అంతర్జాతీయ సరిహద్దు అభివృద్ధి కార్యక్రమం కింద ఈ గ్రామాలను సమగ్ర ఆదర్శ వ్యవసాయ(ఐఎంఎ) గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు ఒక ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యాచరణలో భాగంగా అంతర్జాతీయ సరిహద్దు గ్రామాలలో వ్యవసాయం, పండ్ల తోటల పెంపకం అవకాశాలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. అంతేగాక చేపల పెంపకం, పశు సంవర్ధకం, పాడి, తేనెటీగల పెంపకం తదితర పధకాల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని, వీటి వల్ల రైతుల ఆదాయం పెరుగుతుందని ఆయన తెలిపారు.

100 Villages develop plan along Indo-China border

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News