Saturday, May 4, 2024

డిఐజి లైంగిక వేధింపులు… ఆత్మహత్య చేసుకుంటానని లేఖ…. బాలిక మిస్సింగ్

- Advertisement -
- Advertisement -

IPS Officer

ముంబయి: డిఐజి లైంగిక వేధింపులతో తాను చనిపోతున్నానని సూసైడ్ లెటర్ రాసి ఇంట్లో నుంచి 17 ఏళ్ల బాలిక వెళ్లిపోయిన సంఘటన మహారాష్ట్రలోని నవీ ముంబయిలో జరిగింది. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సోమవారం రాత్రి 11 గంటల తరువాత ఎగ్జామ్స్ ఉండడంతో స్టడీ రూమ్‌లో బాలిక చదువుతోంది. బాలిక తల్లిదండ్రులు బెడ్ రూమ్‌లో నిద్రలోకి జారుకున్నారు. బాలిక అన్నయ్య తన రూమ్‌లో పడుకున్నాడు. సోమవారం వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో బాలిక రూమ్‌కు తండ్రి వెళ్లి చూడగా ఆమె లేకపోవడంతో కుటుంబ సభ్యులకు తెలిపాడు. వెంటనే ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సెక్యూరిటీ అడిగితే ఆమె గేట్ నుంచి వెళ్లలేదని సమాధానం ఇచ్చాడు. దీంతో బాలిక రూమ్ వచ్చి చూస్తే ఓ సూసైడ్ లెటర్ కనిపించింది.

జూన్ 5న తన బర్త్ డేలో డిఐజి తనతో అసభ్యంగా ప్రవర్తించనప్పటి నుంచి తాను మానసిక వేదనతో బాధపడుతున్నానని లేఖలో తెలిపింది. తాను చనిపోవడానికి నిర్ణయం తీసుకున్నాని, అందుకు తన కుటంబానికి క్షమాపణలు కోరుతున్ననని లేఖలో పేర్కొంది. మిమల్ని వదిలి పెట్టి వెళ్లుతున్నానని, అందరి ప్రేమిస్తున్నానని, తన కుటంబ సభ్యులను మిస్ అవుతున్నందకు చాలా బాధగా ఉందని, డిఐజి వేధింపులో తాను ఆత్మహత్య చేసుకుంటానని బాలిక లేఖలో వివరించింది. జూన్ 5న బాలిక 17వ బర్త్ డే సందర్భంగా తన స్నేహితుడు డిఐజి తన భార్యతో కలిసి వచ్చాడు. డిఐజిని తన కూతురు బర్త్ డేకు రమ్మని పిలువలేదని, అతడే స్వతహాగా వచ్చాడని తెలిపాడు. తన కూతురు ముఖానికి కేక్ పూసిన అనంతరం ఛాతీ, చెంపలను అసభ్యంగా తాకాడు.  గతంలో వాళ్లు డిఐజిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అప్పటి నుంచి బాలిక తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. మానసిక బాధతో ప్రతీ రోజు కుంగిపోయింది. బాలిక ఇంట్లో సూసైడ్ లెటర్ రాసి వెళ్లిపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Girl Plans to Kill self blames by DGP after Molest, I don’t want to live this life, i am sorry she wrote i love you all, i blame DIG for my Suicide

 

Girl Plans to Kill self blames by DGP after Molest
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News