Monday, May 6, 2024

బాలికలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి

- Advertisement -
- Advertisement -
  • మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్

పరిగి: బాలికలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ అన్నారు. పరిగి మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు శ్రీనివాస కాలనీలోని బాలికల వసతి గృహంలో బాలికలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, బ్యాగ్‌లను ఎంపిపి అరవింద్‌రావు, జడ్‌పిటిసి హారిప్రియా, ఏఎంసీ ఛైర్మన్ సురేందర్, వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్‌లతో కలిసి చైర్మన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష సాధన దిశగా చదువుకుంటున్న పాఠశాలకు, హస్టళ్లకు, తల్లిదండ్రులకు మంచి గుర్తింపును తీసుకరావాలని సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు ఉచిత విద్యను కేజీ టూ పీజీ వరకు అందిస్తున్నారని తెలిపారు. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి విద్యను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా ఆడపిల్ల్లలు చదువుకుంటే ఇంటికి దీపం లాంటిదని అన్నారు. భవిష్యత్‌లో ఉద్యోగం సంపాదించి ఇతరులకు బాలికలు ఆదర్శంగా నిలవాలన్నారు. అందుకు ప్రాథమిక దశ నుంచే బాగా చదువుకోవాలన్నారు. హస్టల్‌లో ఏలాంటి సమస్యలు ఉన్న మా దృష్టికి తీసుకరావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హస్టల్ వార్డెన్ చంద్రకళ, రుకుంపల్లి సర్పంచ్ ఆర్.శ్రీనివాస్, బిఆర్‌ఎస్ నాయకులు హరి నారాయణ, కృష్ణ, సురేందర్‌రెడ్డి, రఘువీర్, నితీన్, ప్రవీణ్, హస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News