Monday, April 29, 2024

హైదరాబాద్ సిసి కెమెరాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు

- Advertisement -
- Advertisement -

Global recognition for Hyderabad CCTV cameras

ప్రపంచం వ్యాప్తంగా 16 ర్యాంక్ దక్కించుకున్న నగరం

హైదరాబాద్ : సురక్షితమైన ప్రదేశంతో పాటు సిసి కెమెరాల వినియోగంలో ప్రపంచ వ్యాప్తంగా టాప్ 20లో హైదరాబాద్ నగరం 16వ స్థానంలో ఉందని, ఇందుకు సహకరించిన స్టేక్ హోల్డర్స్‌కు అభినందనలు తెలుపుతున్నట్లు రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి గురువారం ట్విట్టర్‌లో తెలిపారు. అన్ని వర్గాల వారి ఐక్యత, అడుగడుగునా నిఘాతో హైదరాబాద్ నగరం సురక్షితంగా ఉందని, సర్వమతాలు శాంతిని పెంపొందిస్తూ హైదరాబాద్ నగరం దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆదర్శవంతంగా మారిందని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో తైవాన్ నాలుగు లక్షల కెమెరాలతో ప్రపంచ వ్యాప్తంగా సురక్షిత ప్రాంతాలలో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే చైనాలో పలు నగరాలు సైతం నిఘా, సురక్షిత ప్రాంతాలుగా గుర్తింపు పొందాయని. ఈక్రమంలో హైదరాబాద్ నగరం ప్రతి వెయ్యిం మందికి ఒక కెమెరా చొప్పున 3 లక్షల కెమెరాలతో నిఘా ఉంచడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా సురక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందినట్లు డిజిపి ట్విట్‌లో తెలిపారు.

చార్మినార్ పోలీసులకు డిజిపి అభినందనలు :

నగరంలో కురిసిన వర్షం ధాటికి హైకోర్టు గేట్ నంబర్ 3 వద్దకు భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో చార్మినార్ ట్రాఫిక్ పోలీసు సిబ్బంది గురువారం నాడు వెంటనే స్పందించి ఆ నీటిని కాలువల్లోకి వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. దీంతో వాహన చోదుకులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు శ్రమించడంతో డిజిపి అభినందనలు తెలిపారు.

Global recognition for Hyderabad CCTV cameras

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News