Saturday, April 27, 2024

కర్నాటక ఎన్నికల రోజు గోవాలో ‘పెయిడ్ హాలీ డే’!

- Advertisement -
- Advertisement -
ప్రతిపక్షం, పారిశ్రామిక సంస్థలు అగ్గిమీద గుగ్గిలం

పానాజీ: గోవాలోని బిజెపి ప్రభుత్వం మే 10న ‘పెయిడ్ హాలీడే’గా ప్రకటించింది. ఇది ప్రైవేట్ సంస్థలలో పనిచేసే వారికి కూడా వర్తించనున్నది. పొరుగున ఉన్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఈ సెలవు దినం ప్రకటించింది. అయితే ప్రమోద్ సావంత్ ప్రభుత్వం తాలూకు ఈ నిర్ణయం ప్రతిపక్ష పార్టీలు, పారిశ్రామిక సంఘాలకు మింగుడుపడలేదు.
గోవా ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.

రాష్ట్ర పారిశ్రామిక మంత్రి మౌవిన్ గోదిన్హో మంగళవారం మాట్లాడుతూ గత ఏడాది గోవా అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కర్నాటక ప్రభుత్వం కూడా పెయిడ్ హాలీడేను ప్రకటించిందన్న విషయాన్ని ఉటంకించారు. కాగా గోవా రాష్ట్ర పరిశ్రమల సంఘం అధ్యక్షుడు దామోదర్ కొచ్కర్ రాష్ట్ర ప్రభుత్వం ‘అసంబద్ధ’ నిర్ణయం వెనుక ఉన్న ‘హేతుబద్ధతను’ ప్రశ్నించారు. గోవాలోని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అమిత్ పాలేకర్ ప్రభుత్వం నిర్ణయాన్ని ‘తెలివితక్కువ నిర్ణయం’ అని విమర్శించారు. గోవా ఫార్వర్డ్ పార్టీ(జిఎఫ్‌పి) కూడా ఈ నిర్ణయాన్ని ఖండించింది. మహదేయ్ నదీ జలాలను పంచుకోవడంపై గోవా, కర్నాటక మధ్య తీవ్ర వివాదం ఉంది. సెలవు నిర్ణయంపై ప్రతిపక్ష సభ్యులు కొందరు అనవసరమైన సమస్ను సృష్టిస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల మంత్రి మౌవిన్ గోడిన్హో ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News