Saturday, April 27, 2024

కదిలిన గోదావరి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురు స్తున్న వర్షాలతో ప్రధాన నదుల్లో వరదనీటి చేరికలు ప్రా రంభమయ్యాయి. నిన్నమొన్నటి దాకా చుక్కనీరు రాక డె డ్ స్టోరేజీ స్థాయిలో ఊస్సూరు మంటున్న జలాశయాల్లో కి కొత్త నీటి చేరికలతో నీటిమట్టాలు క్రమేపీ ంజుకుంటు న్నాయి. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని కృష్ణాగోదావరి న దుల్లో నీటి చేరికల పరిస్థితి ఆశాజకంగా మారుతోంది. గోదావరి నదిలో వరద చేరికలు ఇప్పటికే ప్రారంభ మయ్యాయి. గోదావరికి ప్రధాన ఉపనదుల్లో ఒకటిగా ఉ న్న ప్రాణహిత నదిలో వదర ఉధృతి పెరిగింది. అటు ఎ గువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రధాన గోదావరిలో కూడా వరద కదిలింది. ఎగువ నుంచి శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి 8555 వరదనీరు చేరు తోంది. మరోవైపు కాళేశ్వరం ఎత్తిపోతల పంపుల ద్వారా పనురుజ్జీవ పథకం కింద మరో 4100క్యూసెక్కుల నీరు చేరుకుంటోంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి మొ త్తం 12600 నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీ టి 1067అడుగులకు పెరిగింది. జలాశయంలో నీటి నిలువ 22.60టిఎంసిలకు చేరుకుంది. శ్రీపాద ఎ ల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా 7346క్యూసెక్కుల నీరు చేరుకుంటోంది. కడెం నది ద్వారా కడెం ప్రాజెక్టులోకి 3349క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి చేరుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద మోటార్లతో నీటి తోడిపోత ప్రక్రియ కొనసాగుతోంది. మిడ్‌మానేరు జలాశయంలో నీటినిలువ 15.38టిఎంసీలకు పెరిగింది.లోయర్ మానేరు ప్రాజెక్టులోకూడా నీటి నిలువ 8.44టిఎంసీలకు చేరుకుంది. మంజీరా నదిలో స్వల్పంగా నీటి ప్రవాహాలు సింగూరు ప్రాజెక్టులోకి చేరుతున్నారు. ఈ ప్రాజెక్టులో నీటినిలువ 18.20టిఎంలకు చేరింది.
భద్రాచలం వద్ద 19అడుగులకు గోదావరి నీటిమట్టం
గోదావరి నదీ పరివాహకంగా కురుస్తున్న వర్షాలతో పలు ఉపనదులు వరదనీటితో పరవళ్లు తొక్కుతున్నాయి. ఇవి నేరుగా గోదావరిలో కలుస్తుండటంతో నదిలో నీటి ప్రవాహం పెరుగుతూ వస్తోంది. భధ్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం 19అడుగులకు చేరవయింది. గోదావరి వరదప్రవాహాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తున్న కేంద్ర జలసంఘం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

కృష్ణాల్లో మెల్ల మెల్లగా నీటి చేరికలు
కృష్ణనదీ పరివాహక ప్రాంతాల్లో ఈ సీజన్‌కు చెప్పుకోదగ్గ వర్షాలు లేకపోవంటంతో ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు ఉస్సూరుమనిపిస్తున్నాయి. అయితే గత నాలుగు రోజుల నుంచి కృష్ణనది పరివాహకంగా పరిస్థితి ఆశాజనకంగా మారుతోంది. ఎగువన ఆల్మట్టి జలాశయంలోకి మెల్లమెల్లగా నీటి వరదనీటి చేరికలు మెరగు పడుతున్నాయి. శుక్రవారం 9993క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఆల్మట్టిలోకి ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 4.25టిఎంసీ నీరు చేరుకుంది.ప్రాజెక్టులో నీటినిలువ 23.62టిఎంసీలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఉజ్జయినిలోకి కూడా 1037క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. కృష్ణానదికి ప్రధాన ఉపనదిగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టులోకి కూడా వరద ప్రవాహాలు పెరుగుతూ వస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఈ ప్రాజెక్టులోకి 9582 క్యూసెక్కుల నీరు చేరుతోంది.

ఈ సీజన్‌లో ఇప్పటివరకూ తుంగబధ్ర జలాశయంలోకి 6.55టిఎంసీల నీరు చేరింది. దీంతో జలాశయంలో నీటినిలువ 8.28టిఎంసీలకు చేరుకుంది. 129టిఎంసీల నీటినిలువ సామర్ధం ఉన్న ఆల్మట్టి జలాశయంలో గత ఏడాది ఈ సమయానికి 91.35టిఎంసీల నీరు నిలువ ఉండేది. అదే విధంగా 105టిఎంసీల నీటినిలువ సామర్ధం ఉన్న తుంగభద్ర ప్రాజెక్టులో కూడా ఈ సమయానికి 98.80టిఎంసీల నీరు నిలువ ఉండేది. ఆల్మట్టి దిగువన ఉన్న నారాయపూర్ ప్రాజెక్టులో కూడా 33టీఎంసీల నీరు నిలువ ఉండేది. ఈ ఏడాది ఈ ప్రాజెక్టులోకి నీటి చేరికలు ఇంకా ప్రారంభం కాలేదు. ఎగువన ఉన్న ప్రాజెక్టులు నిండితే తప్ప జూరాలకు కృష్ణమ్మ దిగివచ్చే పరిస్థితి లేదంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News