Monday, April 29, 2024

‘గాడ్‌ఫాదర్’గా చిరంజీవి

- Advertisement -
- Advertisement -

Godfather movie motion poster release

 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ఓ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఆదివారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు ‘గాడ్‌ఫాదర్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టైటిల్ పోస్టర్‌లో చిరంజీవి పూర్తి లుక్‌ని రివీల్ చేయనప్పటికి.. ఈ బ్యాక్‌సైడ్ పోజ్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. మెగాస్టార్ ఇందులో తలకు క్యాప్ పెట్టుకొని చేతిలో గన్ పట్టుకొని నిలబడి ఉన్నాడు.

కాగా ’గాడ్ ఫాదర్’ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ ’లూసిఫర్’ చిత్రానికి తెలుగు రీమేక్. ఒరిజినల్ స్టోరీలోని ప్రాథమిక ప్లాట్ లైన్‌ను మాత్రమే తీసుకొని మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌కు తగినట్లుగా దర్శకుడు మోహన్ రాజా స్క్రిప్టులో మార్పులు చేశారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై ‘గాడ్ ఫాదర్’ సినిమా రూపొందుతోంది. ఆర్.బి. చౌదరి, – ఎన్‌వి ప్రసాద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్టంట్ మాస్టర్ సిల్వ ఆధ్వర్యంలో ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది.

బర్త్‌డే గిఫ్ట్…

ఆదివారం చిరంజీవి బర్త్‌డేను పురస్కరించుకొని ‘ఆచార్య’ నుంచి ఒక కొత్త పోస్టర్… కుదిరితే రిలీజ్ డేట్ కూడా ఈ పోస్టర్‌లో చెప్పే అవకాశం ఉంది. ఇక తమిళంలో హిట్టయిన ‘వేదాళం’ సినిమా రీమేక్‌లో కూడా చిరంజీవి నటించనున్నారు. ఈ సినిమాకు మెహెర్ రమేష్ డైరెక్టర్. ఇందులో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించనుంది. ఆదివారం ఈ మూవీ నుంచి ఒక అప్‌డేట్ రానుంది. ఇటీవల డైరెక్టర్ బాబీ చెప్పిన కథకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఆదివారం ఈ సినిమా నుంచి కేవలం ఒక పోస్టర్ వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News