Monday, April 29, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఫ్యాన్ లో తరలిస్తున్న బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

శంషాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలలో భాగంగా ఇద్దరు వేరు వేరు విమానాల్లో వచ్చిన ప్రయాణికుల వద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారంను గుర్తించారు. అధికారులు శంషాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రతిరోజు తనిఖీలు చేస్తుండగా బంగారం పట్టుబడుతూనే ఉంది .అధికారులు తమదైన నైపుణ్యత తో స్మగ్లింగ్ చేస్తున్న స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా బంగారం తరలిస్తున్న నిందితులు తమ తీరు మార్చుకోకుండా రోజు మాదిరిగా వేరు వేరు మారు రూపాల్లో బంగారాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు తన అనుభవాన్ని ఉపయోగిస్తూ చకాచక్యంగా స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని జైళ్లకు తరలిస్తున్నారు.

అదే మాదిరిగా గురువారం నాడు మరోసారి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కొలాంలంపూర్ నుండి హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ప్రయాణికుడి వద్ద 636 గ్రాముల బంగారం ఉన్నట్టు గుర్తించారు. ఎయిర్ పోర్ట్ అధికారులు నిందితుడు బంగారాన్ని ఫ్యాన్ మోటార్ లో అమర్చుకుని వచ్చి అడ్డంగా కస్టమ్స్ అధికారులకు దొరికి పోయాడు. మరో నిందితుడు రియాద్ నుండి హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు. అనుమానంతో వ్యక్తిని తనిఖీలు నిర్వహించగా నిందితుడి వద్ద 5 బంగారం బిస్కెట్లు గుర్తించారు. కస్టమ్స్ అధికారులు నిందితుడు బంగారం ప్యాంట్ లోపల దాచుకుని వస్తుండగా అధికారులకు అనుమానం రాగా ఆ యొక్క వ్యక్తిని తనిఖీలు చేయగా పట్టుబడ్డాడు. ఇద్దరి వద్ద పట్టుబడ్డ బంగారం సుమారు కిలో 268 గ్రాములుగా ఉంటుందంటూ అంచనా వేశారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 73 లక్షల 97 వేలు ఉంటుందని  కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News