Monday, April 29, 2024

హెచ్‌ఎండిఏ మట్టి గణపతిని ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లక్ష వినాయక మట్టి విగ్రహాల పంపిణీలో భాగంగా హెచ్‌ఎండిఏ ఉచితంగా పంపిణీ చేయనున్న గణపతిని మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. 2017 నుంచి మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న హెచ్‌ఎండిఏ పర్యావరణ హితం కోసం హెచ్‌ఎండిఏ ఈసారి 40 కేంద్రాల్లో లక్ష విగ్రహాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించింది. ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) మట్టి విగ్రహాల పంపిణీలో తన వంతు బాధ్యతను నిర్వహిస్తోంది. ప్రతి ఏటా లక్ష మట్టి వినాయక ప్రతిమలను హెచ్‌ఎండిఏ ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తోంది. ఏడాది లక్ష వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఉదయం మంత్రి కెటిఆర్, మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజులతో కలిసి కెటిఆర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎంఏయూడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్‌ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్‌కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్‌రాస్, హెచ్‌ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రభాకర్, హెచ్‌ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీమతి పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. తదుపరి తెలంగాణ సచివాలయంలో ఎంఏయుడి స్పెషల్ సిఎస్, హెచ్‌ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ ఆధ్వర్యంలో హెచ్‌ఎండిఏ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమాకి వినాయక మట్టి ప్రతిమను అందజేశారు. గురువారం 14వ తేదీ నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు 17వ తేదీ వరకు జంట నగరాల్లోని 40 కేంద్రాల్లో హెచ్‌ఎండిఏ యంత్రాంగం ఈ ప్రతిమలను పంపిణీ చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News