Friday, April 26, 2024

గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’

- Advertisement -
- Advertisement -

గోపీచంద్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బన్నీ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్, యువి క్రియేషన్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబర్ 1న థియేటర్లలో విడుదల చేస్తామని ఫిల్మ్‌మేకర్స్ ప్రకటించేశారు. ఈ ప్రారంభోత్సవంలో అల్లు అరవింద్, గోపీచంద్, మారుతి, బన్నీ వాసు తదితరులు పాల్గొన్నారు. రాశీఖన్నా ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇక ‘పక్కా కమర్షియల్’ మూవీ టైటిల్‌కి తగ్గట్టే ప్రతీది కమర్షియల్‌గా ఆలోచించే యువకుడి కథ అని తెలిసింది. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు తరహాలోనే కాన్సెప్ట్ బేస్డ్ కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇదని సమాచారం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః కరమ్‌చావ్లా, మ్యూజిక్‌ః జకేస్ బీజాయ్, ఎడిటింగ్‌ః ఎస్.పి.ఉద్భవ్.

Gopichand Pakka Commercial movie shoot begins

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News