Friday, May 10, 2024

అమానుష చర్యకు ప్రభుత్వం మద్దతు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఇటీవల సిక్కు వ్యక్తిపై పోలీసులు దాడి చేయడమే కాక, అతని తలపాగాను ఊడగొట్టే అమానుష చర్యపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ప్రతికూల వైఖరి అవలంబిస్తోందని పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ఢంఖార్ సోమవారం ధ్వజమెత్తారు. మమతాబెనర్జీ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అమానుష చర్యకు పూర్తిగా మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపించారు. గతవారం బిజెపి నిరసనలో సిక్కు వ్యక్తిపై పోలీస్‌లు దాడి చేయడం, అతని తలపాగా ఊడదీయడం వైరల్ అయి విమర్శలకు దారి తీసింది.

బాధితుడు 43 ఏళ్ల బల్వీందర్ సింగ్ పంజాబ్ లోని భాటిండియాకు చెందిన వాడు. గవర్నర్ ఆదివారం సిక్కు సమాజసభ్యులను కలుసుకుని ఈ విషయమై అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అయితే, కొన్ని వర్గాలు దీనికి మతపరమైన రంగు పులుముతున్నాయని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. పోలీసులతో ఆ సిక్కు వ్యక్తి ఘర్షణ పడడం వల్ల అతని తలపాగా ఊడిందని వివరించింది. సెక్రటేరియట్‌కు బిజెపి సాగించే మార్చ్‌లో ఆ వ్యక్తి అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడంతో అరెస్టు చేసినట్టు రాష్ట్రహోం శాఖ తెలియచేసింది.

Gov slams Bengal Govt over law and order situations

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News