Tuesday, April 30, 2024

కాకతీయుల కట్టడాలకు రక్షణ కల్పించండి: కేంద్రానికి గవర్నర్ తమిళిసై లేఖ

- Advertisement -
- Advertisement -

Gov Tamilisai writes to Center on Kakatiya's Constructions

మనతెలంగాణ/హైదరాబాద్: వరంగల్ జిల్లా ముప్పరం గ్రామంలోని కాకతీయుల కాలంనాటి త్రికూట ఆలయాన్ని పరిరక్షించ డంలో భాగంగా మరమ్మత్తు, పునరుద్ధరణ పనులను చేపట్టాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రామాయణానికి సంబంధించి అందమైన కుడ్య చిత్రాలు దాని పైకప్పుపై చెక్కబడిన ఆలయం శిథిలమయ్యిందని ఈ నేపథ్యంలో దీని పునరుద్ధరణ పనులను చేపట్టాలని గవర్నర్ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఈ స్థలాన్ని పరిశీలించి సమన్వయం చేసుకోవాలని భారత పురావస్తు శాఖ, సర్వే ఆఫ్ ఇండియాకు సూచించాలని మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ను గవర్నర్ అభ్యర్థించారు. పురాతన కట్టడాలను రక్షించడం చాలా ముఖ్యమని, భవిష్యత్ తరాలకు ఈ కట్టడాలు చాలా ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. కాకతీయ రాజవంశస్థులు అనేకగొప్ప నిర్మాణాలను నిర్మించారని, ఈ నిర్మాణాలు భావి తరాలకు గొప్ప వారసత్వాన్ని అందిస్తాయన్నారు.

Gov Tamilisai writes to Center on Kakatiya’s Constructions

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News