Saturday, May 4, 2024

పూసల సంచార జాతులకు సర్కారు రుణాలు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్:తెలంగాణ రాష్ట్రంలో అనగారిన వర్గాలను ఆర్థికంగా ఆదుకుని, మరుగున పడిన వృత్తి కులాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అందుకే పూసల, సంచార జాతుల కులాలకు లక్షరూపాయలు రుణాలను ప్రభుత్వం అందజేయబోతుందన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని వాసర గార్డెన్స్‌లో జరిగిన పూసల సమర శంకరాభం రాష్ట్రసదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తరతరాలుగా అన్నగారిన కులాలు సంచార జాతులు వృత్తి కులాలు ఎదుర్కొంటున్నసమస్యలను మంత్రి సోదాహరణంగా వివరించారు.

గత పది దశా బ్దాలుగా గుర్తింపునకు నొచుకొని కులాలు, వాటి వృత్తులు కనుమరుగవుతున్న
తరుణంలో సీఎం కేసీఆర్ వృత్తులను బతికించే కార్య క్రమాన్ని చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుబోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, మేయర్ వై సునీల్‌రావు, రవీందర్‌రావు, కరీంనగర్ పూసల సంఘం అధ్యక్షుడు కోనేటి శ్రీనివాస్ -నాగమణి, పూసల ఆత్మ గౌరవ ట్రస్టు చైర్మన్ గుంటుపల్లి వెంకట్, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News