Saturday, April 27, 2024

అన్ని రంగాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

కోయిలకొండ : అన్ని రంగాల, వర్గాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగడం జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో గత తొమ్మిది సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిందని ఎమ్మెల్యే ఎస్. రాజేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అంకెళ్ల గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం నూ తనంగా నిర్మించిన ఉర్దూ కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు.

కోయిలకొండ మండల కేంద్రంలో నిర్మిస్తున్న నూతన లైబ్రరీకి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇబ్రహీంనగర్ గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా నిర్మించిన పాఠశాల భవనంతో పాటు, క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని అభివృద్ధి చేయాల్సిన సంకల్పంతో నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్ర భుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పాఠశాలల అ భివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.

విద్య వైద్యం ఆరోగ్యంతో పాటు అనేక సంక్షేమ పథకాల ద్వారా గ్రామాలలోని ప్రజల జీవన పరిస్థితులను మార్చడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శశికళ, భీంరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మండల బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కృష్ణయ్య, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యు డు ఖాజా, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, మండల కన్వీనర్ మల్లయ్య, నాయకులు మోదీపూర్ రవి, లక్ష్మీనారాయణ, రాజవర్ధన్‌రెడ్డి, నారాయణ, మొగులయ్య, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News