Saturday, April 27, 2024

ఉద్యోగుల విభజనలో స్థానికతకే ప్రాధాన్యమివ్వాలి..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్: పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పడిన 33 జిలాల్లో ఏ జిల్లా ఉద్యోగిని అక్కడే సర్దుబాటు చేయాలని టీఎన్జీవో ప్రెసిడెంట్ మామిడ్ల రాజేందర్ కోరారు. ఆదివారం ఉద్యోగుల విభజన విషయమై సిఎస్ సోమేష్‌కుమార్‌తో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ”రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం పది జిల్లాల స్థానంలో 33 జిల్లాలు ఏర్పాటు చేశారు. ఆ ఉద్యోగాలు స్థానికంగా ఉన్నవారికే దక్కాలి. ఉద్యోగుల విభజనపై సూచనలు సలహాలు అందజేశాం. రాష్ట్రంలో పనిచేస్తున్న ఏ ఉద్యోగికి నష్టం జరగకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోరాం. సిఎం కెసిఆర్ రెండు దఫాలుగా చర్చలు జరిపారు. ఏ జిల్లా ఉద్యోగిని ఆ జిల్లాలోనే సర్దుబాటు చేయాలని కోరాం. మా సూచనలు సలహాలు పాటిస్తామని వెల్లడించారు. భార్యాభర్తలు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. ఎస్సి, ఎస్టీ కులాల వారికి రోస్టర్ విధానం పాటించాలని కోరాం. ఉద్యోగుల పని భారం తగ్గించేందుకు సిఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది” అని అన్నారు.

ఉద్యోగ సంఘాల అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ.. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేలా సిఎం కెసిఆర్ ఆలోచన చేస్తున్నారు. ఉద్యోగుల విభజనలో సీనియారిటీ పద్దతిగా, లోకల్ క్యాడర్‌కు అనుకూలంగా జరుగుతుంది. వివిధ విభాగాల ఉద్యోగులు ఈ విభజనకు సహకరించాలి. ఈ నెల లోపలనే ఆప్షన్ ఉంటాయి. ఈ ఆప్షన్‌లు ఆఫ్ లైన్‌లోనే ఉంటాయి. ఉద్యోగుల నోటిఫికేషన్‌లపై సిఎం కెసిఆర్‌తో త్వరలోనే భేటి అవుతాం. సమావేశంలో ఉద్యోగుల సంఘాల నేతలు పాల్గొన్నారు.

Govt Employee Unions met CS Somesh Kumar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News