Monday, April 29, 2024

ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

100 శాతం సబ్సిడీతో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు
లబ్ధిదారులు స్థానికంగా నివాసితులై ఉండాలి
అద్దెకు ఉన్నవారు సైతం అర్హులే…
జిల్లా ఇన్‌చార్జీ మంత్రి అధ్యక్షతన కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక

మనతెలంగాణ/హైదరాబాద్:  ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు విడుదల చేశారు. ఈ మార్గదర్శకాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లను ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతోపాటు ఈ పథకం కింద మహిళలనే లబ్ధిదారులకు ఎంపిక చేస్తామని పేర్కొంది.

గ్రామ, మండల స్థాయిలో అధికారులను లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రభుత్వం ఈ మార్గదర్శకాల్లో తెలిపింది. ఎంపికైన లబ్ధిదారుల జాబితాను గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, గ్రామ వార్డు సభల్లో వెల్లడిస్తామని, ఆరు గ్యారంటీల్లో భాగంగా సొంత జాగా ఉన్న వారికి 100 శాతం సబ్సిడీతో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. వీటితో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులని, తొలి దశలో సొంత జాగా ఉండి అందులో ఇల్లు లేనివారికి ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది.

లబ్ధిదారులు స్థానికంగా నివాసితులై ఉండాలని, అద్దెకు ఉన్నవారు అర్హత కలిగి ఉంటారని, లబ్ధిదారుల ఎంపిక జిల్లా ఇన్‌చార్జీ మంత్రి అధ్యక్షతన కలెక్టర్లు ఎంపిక చేస్తారని పేర్కొంది. లబ్ధిదారుల ఎంపిక అనంతరం గ్రామ సభల్లో, వార్డు మీటింగ్ లో ప్రకటిస్తారని, ఇళ్ల నిర్మాణం 400 ఎస్‌ఎఫ్‌టి విస్తీర్ణంలో ఆర్‌సిసి పద్ధతిలో ఉంటుందని, బేస్ మెంట్ పూర్తయ్యాక లక్ష రూపాయలు, స్లాబ్ లెవల్‌కు చేరాక మరో లక్ష, స్లాబ్ పూర్తయిన వెంటనే 2 లక్షల రూపాయలు, ఇల్లు పూర్తయిన తర్వాత చివరి లక్ష రూపాయలు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News