Saturday, May 4, 2024

త్వరలో 57ఏళ్ల వారందరికీ కొత్త పెన్షన్లు: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సంబంధిత ప్రక్రియను తక్షణమే ప్రారంభించి, అర్హులైన వారందరికీ పెన్షన్లు అందించనున్నామని, ఈ నిర్ణయంతో కొత్తగా మరో 6,62,000మందికి వృద్ధాప్య పెన్షన్ అందనున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ మేరకు తమ శాఖ అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. సిఎం చేతుల మీదుగా ఈ కొత్త పెన్షన్లను ప్రారంభిస్తామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 ఏండ్లు నిండిన అర్హత ఉన్న వారందరికీ పెన్షన్లు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. రైతు బంధు, బీమా తరహాలోనే మరికొద్ది రోజుల్లోనే నేత, గీత కార్మికులకు కూడా బీమా ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటనను విడుదల చేశారు.

మిగతా హాస్పిటల్స్ తో పాటు, ఇప్పటికే మంజూరైన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను కూడా మొదలు పెడతామన్నారు. వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనించేయడం ప్రారంభిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పూర్వ అదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొంత మేర నల్గొండ జిల్లా ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి హాస్పిటల్స్ మీద భారం తగ్గుతుందని, వేగంగా దగ్గరలో వైద్యం అందటం వల్ల అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చు అని మంత్రి చెప్పారు. కరోనా బాధిత అనాథల బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటున్నదని తెలిపారు. దీనిపై ప్రభుత్వం 11మంది మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని వేసిందన్నారు. త్వరలోనే నివేదిక తెప్పించుకొని, తగు ఏర్పాట్లు చేయనున్నదని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మానవీయంగా పని చేస్తుందనడానికి ఇదే నిదర్శనం అన్నారు.
దళిత బంధు దళితులకు వెన్నుదన్నుగా నిలిచే పథకమని, పంద్రాగస్టు నుంచి ఈ పథకం ప్రారంభం అవుతుందన్నారు.  అలాగే, రూ.50వేల వరకు రైతు రుణమాఫీని ఈ నెలాఖరులోగా పూర్తి చేసి, 6లక్షల మంది రైతులకు మేలు చేయనున్నామని మంత్రి వివరించారు. గత 40ఎండ్లుగా తన రాజకీయ జీవితంలో, ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్న ప్రభుత్వాన్ని, సిఎంని తాను చూడలేదన్నారు. తెలంగాణ ప్రజలు కెసిఆర్ కి రుణపడి ఉంటారని మంత్రి చెప్పారు.

Govt to give pension for people above 57: Minister Errabelli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News