Saturday, May 4, 2024

పెళ్లింట విషాదం..

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : కరెంటు కాటుతో పెళ్లింటా విషాదఛాయలు అలుముకున్న సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన నారోజు పెంటాచారి, విజయ లక్ష్మీ దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. నారోజు నిరంజన్ (38) జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నిరంజన్‌కి ఈనెల 2వ తేది శనివారం బోధన్‌కు చెందిన అమ్మాయితో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. దీంతో సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో పెళ్లి విందు ఏర్పాటు చేశారు.

విందుకు సంబంధించిన ఏర్పాట్లు కోసం నిరంజన్ ఫోన్ మాట్లాడుతూ తెల్లవారు జామున డాబా పైకి ఎక్కాడు. ఇంటికి అలంకరించిన విద్యుత్ సిరియల్ లైట్ల ఇనుప వైర్‌కు విద్యుత్ సరఫరా కావడంతో వైరు తగిలి అక్కడికక్కడే మరణించాడు. పెళ్లి కోసం వేసిన పందిరిలో కొడుకు మృతదేహాన్ని చూడడం పలువురిని కలిచివేసింది. నవ వధువు కుటుంబం కూడా షాక్‌కు గురైంది. పెల్లి కూతురి కాళ్ల పారాణి ఆరక ముందే ఈ విషాదం చోటు చేసుకోవటంలో పెళ్లి కూతురు కుటుంబం విషాదంలో మునిగిపోయింది. రెండు రోజుల క్రితమే పెండ్లి జరిగి రిసెప్షన్‌లో స్టేజ్ ఎక్కాల్సిన తమ కొడుకు ఇలా విగతజీవుడు కావడం చూసి ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News