Saturday, April 27, 2024

నేటి నుంచి గురుకులాలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Gurukul Educational institutions will start from Today

హైకోర్టు ఉత్తర్వుల మేరకు విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో వెంటనే ప్రారంభించేందుకు ఆయా సొసైటీల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు గురుకుల పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎస్‌సి,ఎస్‌టి, బిసి మైనార్టీ గురుకుల సొసైటీల పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు వెయ్యికిపైగా విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో సుమారు 4 లక్షల మంది విద్యార్థులు వివిధ తరగతులలో చదువుతున్నారు. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో… 2020 -21 విద్యా సంవత్సరం మధ్యలో ఇతర సంస్థల మాదిరిగానే గురుకులాల్లో కూడా ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించారు.

రాష్ట్రంలో కరోనా అదుపులో రావడంతో ప్రస్తుత విద్యాసంత్సరానికి సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ గురుకుల విద్యాలయాల్ని తెరిచేందుకు హైకోర్టు అనుమతించలేదు. గురుకులాలు తెరవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా అప్పటి నుంచి జూమ్ ద్వారా ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. తాజాగా గురుకులాలు తెరవద్దన్న గత ఆదేశాలను హైకోర్టు సవరించింది. దాంతో గురుకులాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉన్న నేపథ్యంలో గురువారం నుంచే ప్రారంభించాలని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధ్యాయుడు బాలకృష్ణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం బుధవారం నాడు మరోసారి విచారణ చేపట్టింది. కరోనా పరిస్థితులు కొనసాగుతున్నందున విద్యాసంస్థలు ఇప్పుడే తెరవొద్దంటూ బాలకృష్ణ అనే ఉపాధ్యాయుడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గతంలో విచారణ జరిగింది. కాగా గత నెల 1న రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలు ప్రారంభమైనప్పటికీ గురుకుల విద్యా సంస్థలు మాత్రం తెరుచుకోలేదు. గురుకుల విద్యాలయాల్లో అన్ని వసతులు ఉన్నాయని తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, గురుకుల విద్యాసంస్థల్లో ఎక్కువగా నిరుపేద విద్యార్థులు ఉన్నారని వివరించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో కొవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నామని ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని వాదించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News