Friday, April 26, 2024

గిరిజన గ్రామాల్లో గుస్సాడీ సంబరాలు

- Advertisement -
- Advertisement -

Gussadi festivities from tomorrow in tribal villages

నేరడిగొండ: దీపావళి పండుగ సమీపిస్తున్న సందర్భంగా వారం రోజుల ముందుగా గిరిజన గ్రామాల్లో గుస్సాడీ సంబరాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. మెడలో రుద్రాక్షలు చంకలో జంతు చర్మలు, నెత్తిపై నెమలి ఈకలు టోపి, ముఖానికి మసి, చేతిలో మంత్రదండం ఒంటినిండా బూడిద, నడుం నుంచి మోకాళ్ల వరకు వస్త్రదారణతో గొండుల గస్సాడీ వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. తమ సంస్కృతి ఆచారాలను కట్టుబాట్లను గొండులు కాపాడుకుంటూ వస్తున్నారు. ఆయా గ్రామాలలో బోగి పండుగను ప్రారంభించి గుస్సాడీ దండారి నృత్యాలకు గిరిజనులు శ్రీకారం చుట్టుతారు. నవంబర్ 7నుండి గిరిజనగ్రామాలులఖంపూర్,మధాపూర్,ఎసుగూడ,లక్ష్మిఫూర్,రోల్‌మామడ,లింగాట్ల,గొండుగూడ,కోర్టికల్(కే),నాగమల్యాల్, ఇస్ఫూర్‌తాండ, యాపాల్‌గూడ, గాందారి, గాజిలి, కుంటాల(కే), బంధంరెగడ్, తదితర గ్రామాల్లో దీపావళి వేడుకలు ప్రారంభం కానున్నాయి. గోండుల సంస్కృతితో ఆట పాటలకు అధిక ప్రాదాన్యత ఇస్తారు. నాగరిక పోకడలకు పోని గొండు గిరిజనులు తమకు కావాల్సిన సంతోషాన్ని ఆట పాటల్లోనే వేతుక్కుంటారు.

యేడాది పోడువునా ఎదో ఒక పండుగ జరుపుకోవడం పరిపాటైన గొండులకు దీపావళి సందర్భంగా జరుపుకొనే దండారి పండుగ అత్యంత ప్రదానమైంది. దసరా తరువాత వచ్చే పౌర్ణమి తరువాత ఆయా గిరిజన గ్రామాల గొండులు బోగి పండుగను జరుపుకొని దండారి వేడుకలను ప్రారంభిస్తారు. ఆట పాటల ద్వారా ప్రారంభించే దండారి పండుగను దీపావళి తరువాత కోలాబోడి జరుపుకుని ముగిస్తారు. డప్పు, డోలు మొదలైన వాయిద్వాల చప్పుల్లల్లో ఘల్లు, ఘల్లు మనే గజ్జేల రవ్వల మధ్య సాగే నృత్యగానాలు, కోలాహలుతో గొండు గూడలు మారుమోగుతుంటాయి. గొండు ఆషాడ మాసంలో ఆకాడిపెన్ అనే దేవతకు పూజలు నిర్వహిస్తారు. దండారిలో ఆటపాటలకు ఉపయోగించే డప్పు, రడమేళ, డోల్, కర్ర, పెప్రి, తుడుం, నెమలి ఈకలు మొదలైన సంగీత పరీకరాలను 15 రోజులుగా ముందుగానే తయరు చేసుకుంటారు.

Gussadi festivities from tomorrow in tribal villages

నెమలి ఈకలను పేర్చి సంప్రదాయ రీతిలో గ్రామ పటెల్ ఇంటిముందు ఉంచి పూజలు నిర్వహిస్తారు. గుస్సాడీ వేషదారణ వేసిన వారిని దేవత ఆవహించిందని గొండుల నమ్మకం గుస్సాడీ దండతో తాకితే ఎలాంటి రోగాలైన నయమవుతాయని గిరిజనుల విశ్వాసం ఒక గ్రామానికి చెందిన దండారి బృందం మరో గ్రామానికి చేరుకొని ఆ గిరిజనులతో కలిసి వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ఏ ఊరికి ఇతర గ్రామం నుంచి వచ్చిన దండారి బృందాన్ని సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించి వేడుకలు నిర్వహిస్తారు. మరుసటి సంవత్సరం ఆహ్వానంపై వచ్చిన దండారి బృందం ఆ గ్రామానికి వెళ్లి అక్కడ చేరుకొని వారి అతిథ్యాన్ని స్వీకరించాడం ఆనవాయితీగా వస్తుంది. దీపావళి పండుగకు చిన్న నుంచి పెద్దలు అందరూ నూతన దుస్తువులు ధరించి ఇంటి ముందు ఉన్న ఆవులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News