Saturday, April 27, 2024

ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Minister Talasani Distributed money to Flood Affected Families

హైదరాబాద్: ప్రతి వరద బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కుండపోత వర్షాల కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలకు అండగా ఉండాల్సిన సమయంలో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ది కోసం పాకులాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమని, కేంద్ర ప్రభుత్వం సైతం పైసా సహాయం అందించలేదని ఆయన ధ్వజమెత్తారు. వరదల కారణంగా సర్వం కొల్పొయిన వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు శుక్రవారంఆయన తక్షణ ఆర్ధిక సహాయం కింద రూ.10వేలను అందజేశారు.

ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని గాంధీనగర్ డివిజన్‌లో మాల బస్తీలో, అంబర్‌పేట నియోజకవర్గంలోని బాగ్ అంబర్‌పేట డివిజన్ భరత్ నగర్, కాచిగూడ డివిజన్ లింగంపల్లిలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలసి బాధితులకు ఆర్ధిక సహాయం అందజేశారు. అదేవిధంగా గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని నాల బస్తీలో, మంగళ్ హాట్ డివిజన్ శివలాల్ నగర్‌లో, సనత్ నగర్ నియోజకవర్గంలోని మోండా మార్కెట్ డివిజన్ బండిమెంట్‌లో , బేగంపేట్ డివిజన్‌లో భగవంతాపూర్‌లో బాధిత కుటుంబాలకు రూ.10వేల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు.

అంతకు ముందు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం అండగా నిలబడితే, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పెద్ద మనస్సుతో ఆపన్న హస్తం అందించి, బాధితును తక్షణమే ఆదుకునేందుకు రూ.10 వేల ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. కష్టాలోలో ఉన్న ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయంలో తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలే తగిన బుద్ది చేబుతారన్నారు.నగరంలో పూర్తిగా వదరల్లో చిక్కుకుంటే కేంద్రం ఇప్పటీ వరకు పైసా సహాయం చేయని కేంద్రంపై బిజెపి నేతలు ఒత్తిడి చేయాల్సింది పోయి ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటాన్నారు. నిజంగా నగర ప్రజలపై ప్రేమ ఉంటే విమర్శలు మాని వరద సహాయంపై కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు ముఠా పద్మ, డి.పద్మారెడ్డి, ఎక్కాల చైతన్య, ముకేష్ సింగ్, పరమేశ్వరి, ఆకుల రూప, ఉప్పల తరుణి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టిఆర్‌ఎస్ ఇంఛార్జీ తలసాని సాయి కిరణ్ యాదవ్, డిప్యూటీ కమిషనర్లు ఉమా మహేశ్వరి, వేణు గోపాల్ , ముకుంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News