Saturday, May 4, 2024

సిద్దిపేట డబుల్ బెడ్‌రూం కాలనీ దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

harish rao inaugurates double bedroom houses in siddipet

సిద్దిపేట: దేశంలోనే సిద్దిపేట డబుల్‌బెడ్‌రూం ఇండ్ల కాలనీ ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం కెసిఆర్‌నగర్ కాలనీలో 168 మంది లబ్దిదారులకు డబుల్‌బెడ్‌రూం ఇండ్ల పట్టాలతో పాటు కొత్త బట్టలు అందజేసి మాట్లాడారు. నిరుపేదలు ఆత్మగౌరవం , ఆనందంతో బతకాలన్నదే సిఎం కెసిఆర్ ముఖ్య లక్షమన్నారు. హైదరాబాద్ గేటెట్ కమ్యూనిటీ తరహాలో సిద్దిపేట డబుల్ బెడ్‌రూం ఇండ్ల కాలనీని సకల సౌకర్యాలతో నిర్మించుకున్నామని అన్నారు. జిల్లాలోనే మొదటి పైపుడ్ గ్యాస్ కనెక్షన్‌ను కేసీఆర్ నగర్‌లోనే ఏర్పాటు చేశామన్నారు. నిరుపేదలందరూ తనకు కుటుంబ సభ్యులేనని, అర్హులందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లలో అవకాశం కల్పిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో సొంత గూడు కట్టుకోవాలనే కల ఉంటుందన్నారు.

నిరుపేదల వివాహాలకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందించడంతో పాటు అర్హులైన వారికి రూపాయి ఖర్చు లేకుండా సకల సౌకర్యాలతో డబుల్ బెడ్‌రూం ఇండ్లను కట్టిస్తున్నది టీఆర్‌ఎస్‌సర్కార్ మాత్రమేనన్నారు. లబ్దిదారుల ఎంపికను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా చేశామని అన్నారు. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి నేతృత్వంలోజిల్లా అధికారుల బృందం ఒకటికి రెండు సార్లు సర్వే చేపట్టి అసలైన లబ్దిదారులకే ఇండ్లు దక్కేలా కృషి చేశారన్నారు. లబ్దిదారుల ఎంపిక అనంతరం వారి పేర్లను ప్రతి వార్డులో గోడలకు అతికించామని తెలిపారు. రూపాయి ఖర్చు, ఎలాంటి కష్టం లేకుండా సకల సౌకర్యాలతో ఇండ్లను నిర్మించి తాళం చెవిలను లబ్దిదారులకు అప్పగిస్తున్నామని అన్నారు. నిరుపేదలు సేవలందించడం లోనే అసలైన తృప్తి కలుగుతుందని నిరంతరం మీ సేవాలోనే ఉంటానని అన్నారు. ప్రభుత్వ ఇచ్చిన ఇండ్లను అమ్మినా,కిరాయికి ఇచ్చినా నేరమేనని తమ దృష్టికి వస్తే స్వాధీన పరుచుకుంటామని అన్నారు.

రూ. 2కోట్ల వ్యయంతో కెసిఆర్ నగర్‌లో సమీకృత మార్కెట్‌ను నిర్మించుకున్నామని, త్వరలోనే కాలనీకి సంబంధించిన మార్కెట్‌తో పాటు షాపింగ్ క్లాంప్లెక్స్‌ను ప్రారంభించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కేసీఆర్ నగర్ కాలనీ నిర్మాణం చేపట్టిన నాటి నుంచిసుమారు 400 సార్లు పర్యటించి ఎలాంటి అడ్డంకులు రాకుండా దగ్గరుండి వేగంగా నాణ్యతతో పనులు చేపట్టామన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లలో అర్హులకు తప్ప అనర్హులకు స్థానం లేదని స్పష్టం చేశారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రానున్న రోజుల్లో తప్పకుండా అర్హులకు ఇండ్లు కేటాయిస్తామని భరోసా నిచ్చారు. తనకు ఓ పార్టీకి చెందిన వ్యక్తి సోషల్ మీడియాతో పదే పదే దూషించినా అర్హులని తేలడంతో అతనికి సైతం డబుల్ బెడ్‌రూం ఇండ్లలో ఇల్లు వచ్చిందని ఆ వ్యక్తే తనకు స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపాడని అన్నారు. తోడబుట్టిన అన్నలా.. మీ అందరికీ బట్టలు పెట్టి గృహప్రవేశాలు చేయించడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.

అనంతరం కాలనీలో పర్యటించి కొన్ని ఇండ్లన ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, ఆర్డీవో అనంతరెడ్డి, మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, తహసీల్దార్ విజయసాగర్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ప్రజాప్రతినిధులు,నాయకులు అక్తర్ పటేల్, చిట్టి దేవేందర్ రెడ్డి, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, పూజల వెంకటేశ్వర్‌రావు, బర్ల మల్లికార్జున్, వజీరుద్దీన్, గ్యాదరి రవీందర్, పల్లె వెంకట్‌గౌడ్, కొండం సంపత్‌రెడ్డి, జావిద్, కెమ్మసారం ప్రవీణ్‌కుమార్, సాకి ఆనంద్, శ్రీనివాస్ యాదవ్, చిప్ప ప్రభాకర్, అబ్దుల్ మోయీజ్, తాళ్లపల్లి సత్యనారాయణగౌడ్, మంతెన రాజనరేందర్, అయిలయ్య, బ్రహ్మం, నర్సింలు, జాడేజా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News