Monday, April 29, 2024

మాటలు చెప్పే సర్కార్ కావాలా? చేతల సర్కార్ కావాలా?: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

నారాయణపేట: మాటలు చెప్పే సర్కార్ కావాలా? చేతల సర్కార్ కావాలా? అని ప్రజలను వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా కోస్గిలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. కోస్గిలో 50 పడకల ఆస్పత్రిని హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అని పాడుకునేవారని ఎద్దేవా చేశారు. బిడ్డ కడుపున పడినప్పటి నుంచి ప్రభుత్వం సహాయం చేస్తుందని, గర్భిణీలకు రూ.12 వేలు ఇస్తున్నామని, కాన్పు తరువాత కెసిఆర్ కిట్ ఇస్తున్నామని హరీష్ రావు స్పష్టం చేశారు. కొడంగల్ నియోజకవర్గానికి త్వరలోనే కృష్ణా జలాలు వస్తాయని హామీ ఇచ్చారు.

కొడంగల్‌కు ప్రస్తుతం కృష్ణా నుంచి తాగునీరు వస్తుందని, త్వరలోనే సాగునీరు వస్తందని హరీష్ రావు చెప్పారు. మూడు గంటల విద్యుత్ చాలు అనే రేవంత్ రెడ్డి కావాలా? 24 గంటల కరెంట్ ఇచ్చే సిఎం కెసిఆర్ కావాలో? ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు 12 లక్షల మంది ఆడ పిల్లల వివాహాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశామని వెల్లడించారు. పొరుగున ఉన్న కర్నాటకలో ఎలాంటి పథకాలు ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. కర్నాటకలో వృద్ధాప్య పెన్షన్ రూ.600 మాత్రమే ఇస్తున్నారని దుయ్యబట్టారు. కర్నాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు, రూ.4 వేల పెన్షన్ ఇవ్వడం లేదని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణలో బిజెపి లేచేది లేదని, కాంగ్రెస్ గెలిచేది లేదని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News