Saturday, April 27, 2024

దాహం తీరుస్తుంది!

- Advertisement -
- Advertisement -

Watermelon

వేసవి తాపానికి చెక్ పెట్టేది పుచ్చకాయ. శరీరంలో నీటి శాతాన్ని కోల్పోకుండా చేసే అద్భుత పండు. ఖనిజాలు, లవణాలు, విటమిన్లు నింపుకున్న ఔషధఫలం. ఆఫ్రికాకు చెందిన పుచ్చకాయను చిన్నా పెద్దా అందరూ ఇష్టపడతారు.

* ఇది హైడ్రేటింగ్ పండు. దీంట్లో కేలరీలు తక్కువ కాబట్టి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
* పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ. ఇతర విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది.
* జ్వరంతో బాధపడుతున్న వారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి తాగితే నీరసం తగ్గి శక్తినిస్తుంది.
* ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం తగ్గుతుంది.
* ఎండిపోయే పెదవుల్ని తడిగా ఉంచుతుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట ఉన్నవారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
* గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి.

గింజలూ మంచివే..
పుచ్చ గింజల్లోనూ అనేక పోషకాలు ఉన్నాయి. వీటిలో విటమిన్-బి అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల గుండె జబ్బుల ముప్పు నుంచి బయటపడొచ్చు. ఈ గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి. గింజలను నీటిలో వేసి మరిగించి టీలా తాగడం వల్ల కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయి. జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రతను పెంపొందించడానికి, కండరాల కదలికల క్రమబద్ధీకరణలో పుచ్చ గింజలు తోడ్పడతాయి.

పుచ్చ గింజల టీ ఎలా?
ముందుగా.. పుచ్చకాయ గింజలను ఎండబెట్టి మొత్తగా పొడి చేసుకోవాలి. రెండు లీటర్ల నీటిలో రెండు టేబుల్ స్పూన్ల గింజల పొడి వేసి పావుగంటసేపు మరిగించాలి. దీన్ని రెండు రోజులపాటు తాగొచ్చు. తర్వాత ఓ రోజు గ్యాప్ ఇచ్చి మళ్లీ రెండు రోజులు తాగాలి.

అతిగా తింటే మంచిది కాదు..
పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికి తెలిసిందే. వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. ఏదైనా సరే పరిమితి మించితే.. విషంగా మారుతుంది. పుచ్చకాయ కూడా అంతే ఎక్కువ తింటే మంచిది కాదు. దానివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు జరుగుతాయో చూద్దాం!
* పుచ్చకాయలో ఉండే పొటాషియం వల్ల నాడీవ్యవస్థ బలహీనపడుతుంది. గుండె లయ తప్పడంతో గుండెపోటు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.
* పుచ్చకాయలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవాళ్లకు సమస్యలు తప్పవు.
* లో బీపీతో బాధపడేవారు పుచ్చకాయకు దూరంగా ఉండడం మంచిది. దీన్ని తిన్నప్పుడు రక్తపోటు మరింత తగ్గే ప్రమాదం ఉంది.
* పుచ్చకాయ ఎక్కువ తినడం వల్ల అలర్జీలు ఏర్పడే అవకాశం ఉంది. శరీరంపై దద్దుర్లు, ముఖవాపు ఏర్పడవచ్చు.
* గర్భిణులు అధికంగా తినడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయులు పెరిగి గర్భధారణ మధుమేహానికి దారితీయొచ్చు.
* దీన్ని అతిగా తినడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. దీని వల్ల శరీరం అలసటకు గురవుతుంది.
* పుచ్చకాయలో ఉండే సార్బిటాట్ అనే రసాయనం వల్ల అసిడిటీ ఏర్పడుతుంది.

Health Benefits of Eating Watermelon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News