Wednesday, May 1, 2024

హెల్త్ ప్రొఫైల్ తీసుకొస్తాం: ఈటెల

- Advertisement -
- Advertisement -

Etela rajender

 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ ప్రొఫైల్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. శాసన మండలిలో తెలంగాణ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాజేందర్ మాట్లాడారు. చింతమడకలో యశోద ఆస్పత్రి సహకారంతో హెల్త్ ప్రొఫైల్ ఏర్పాటు చేశామని, గజ్వేల్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ ఏడాది చివరి వరకు హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని వివరించారు. కిడ్నీ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని, 40 ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని, కంటి వెలుగు ద్వారా 40 లక్షల మందికి కళ్ల అద్దాలు పంపిణీ చేశామని ఈటెల పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News