Home తాజా వార్తలు హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్ లో భారీ వర్షం..

Heavy Rain in Hyderabad

హైదరాబాద్: నగరంలో భారీ వర్షం కురుస్తోంది. శనివారం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతోపాటు మేఘాలు కమ్ముకుని పలుచోట్లు భారీ వర్షం పడుతోంది. మరికొన్ని చోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. నగరంలోని అమీర్ పేట్, పంజాగుట్టా, బేగంపేట్, సికింద్రాబాద్, తార్నాక, కుషాయి గూడ, చెంగిచెర్ల, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, మలక్ పేట్, మూసరాంబాగ్, అంబర్ పేట్, దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్ తోపాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో జిహెచ్ఎంసి అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని తెలిపారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 04021111111ను కూడా ఏర్పాటు చేశారు.

Heavy Rain in Hyderabad