Monday, April 29, 2024

గడగడలాడించిన ఆ గంట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రమంతటా వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలు సృష్టించిన బీభత్సానికి రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకలు, చిన్నతరహా నదులన్నీ పొం గిపొర్లుతున్నాయి. చిన్నచిన్న వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బ్రిడ్జీలు, కాజ్‌వేల పైగా నీరు ప్రవహిస్తూ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగుల మూలంగా రొడ్లు తెగిపోవడం తో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంతేగాక తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య కూడా రాకపోకలు బంద్ అ య్యాయి. వరదనీటి ప్రవాహానికి రోడ్లు తెగిపోవడమే కాకుండా, విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయాయి. కొన్నిచోట్ల విద్యుత్ వైర్లు తెగి రోడ్లపై పడ్డాయి. మెజారిటీ జిల్లాల్లో చెట్టు కూ లిపోయాయి. కూలిపోయిన చెట్లు రోడ్లపైనే ప డిపోవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

మొత్తం మీద ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌ను కారుమబ్బులు కమ్మేసాయి. నగరం పరిధిలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. మూసి నది వరద నీటితో ఉరకలేస్తోంది. మూసారాంబాగ్ వంతెనపైకెక్కిన వరదనీరు ఆ మార్గలో రాకపోకలను నిలిపివేసింది. పోలీసులు ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. ప్రధాన మార్గాల్లోని పలు ప్రాంతాల్లో వరదనీరు నాళానీరు కలిసి పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. నగరం పరిధిలో ట్రాఫిక్ జామ్‌తో పలు మార్గాలు గంటల తరబడి వాహనాలనూ రోడ్లపైనే కదలకుండా నిలిపివేస్తోంది. అధికారులు డిఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. జిహెచ్‌ఎంసి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటిచింది. 0402111 1111తోపాటుగా 900011 3667 నెంబర్లను ప్రకటించింది. మరో 24గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ,అత్యవసరం అయితే తప్ప ఇళ్లు వదిలి బయటకు రావద్దని నగరమంతటా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు.

మరో నాలుగు రోజులు భారీ వర్షాలు:
రాష్ట్రంలో రానున్న మరో నాలుగు రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రమంతటా మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటిచింది. మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రాగల నాలుగు రోజులు ఉరుములు , మెరుపులతో పాటు గంటకు 40నుండి 50కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం వరకూ ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించించింది. మహబూబాబాద్ , వరంగల్ , హన్మకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్‌కర్నూల్ జల్లాలతో భారీ వర్షాలు కురిరే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ ,ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు రెండ్ అలెర్ట్‌ను జారీ చేసింది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అక్కడక్కడ గంటకు 40-నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వానలు పడే ఛాన్స్ ఉంటుందని తెలిపింది. నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి భారీ వర్షాలు, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, ఖైరతాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
దండు మైలారంలో 70.8 మి.మి వర్షం
రాష్ట్రంలో గడిచిన 24గంటలుగా భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని దండుమైలారంలో 70.8 మి.మి వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో 70, ఆత్మకూరులో 51.8 మి.మి వర్షం కురిసింది. అడుంగుపేటలో 51, ఉర్లుగుండలో 50, తిరుమలగిరిలో 49.5, చెన్నారారు పేటలో 48, సర్దామహల్‌లో 47, చార్మినార్‌లో 47.8, జుల్‌పల్లిలో 44, సౌత్ హస్తినాపురంలో 44.8, హయత్‌నగర్‌లో 44, సరూర్‌నగర్‌లో 44, ఖైరతాబాద్‌లో 41, సైదాబాద్‌లో 41 ,శివరాంపల్లిలో 40.5 మి.మి చోప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News