Saturday, April 27, 2024

పండుగలా కెటిఆర్ జన్మదినోత్సవం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె. టి. రామారావు 47వ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా జన్మదిన వేడుకలు జరిగాయి. మంత్రులు, పార్టీ నాయకులు, అభిమానులు కేక్ కటింగ్‌లు, మొ క్కలు నాటడం, రక్తదాన శిబిరాలు, నిరుపేదలకు సాయం చేయడం వంటి కా ర్యక్రమాలతో పాటు మరికొందరు వినూత్న రీతిలో కెటిఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కెటిఆర్ పిలు పు మేరకు పార్టీ నాయకులు, అభిమానులు పలుచోట్ల సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ నేత దాసోజ్ శ్రావణ్ కేక్ కట్ చేసి, రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం దాసోజు శ్రవణ్ కెటిఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్‌ఎ బాల్క సుమన్, కార్పొరేషన్ చైర్మెన్లు, కట్టెల శ్రీనివాస్ యాదవ్,బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా రూబిక్ క్యూబ్స్‌తో కెటిఆర్ చిత్రం
మంత్రి కెటిఆర్ జన్మదిన వేడుకలు సోమవారం పివి మార్గ్‌లో ని థ్రిల్ సిటీ థీమ్ పార్క్‌లో వినూత్నంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రపంచ రికార్డ్ సాధించిన రూబిక్స్ క్యూబ్ ఆర్టిస్ట్ ఇర్ఫాన్ కుట్టి కండ్లకు గంతలు కట్టుకొని రూబిక్ క్యూ బ్స్‌తో రూపొందించిన కెటిఆర్ చిత్రం,హ్యాపీ బర్త్ డే కెటిఆర్ అ న్న అనే విషెస్ ఆహ్వానితులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఇర్ఫాన్ కుట్టిని సత్కరించి అభినందించారు. అదేవిధంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఒకొక్కరికి 10 లక్షల రూపాయల రిక్స్ కవరేజ్ తో వివిధ ఛానళ్లకు చెందిన వెయ్యి మంది వీడియో జర్నలిస్ట్‌లకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను మంత్రుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా థ్రిల్ సిటీ థీమ్ పార్క్‌లోని వరల్డ్ బిగ్గెస్ట్ త్రీడీ స్క్రీన్‌లో మంత్రి కెటిఆర్‌కు విషెస్ తెలియజేస్తూ రూపొందించిన వీడియోను వీక్షించారు. అదేవిధంగా కెటిఆర్ పనితీరు, వ్యక్తిత్వం, సాధించిన విజయాలను వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక సాంగ్‌ను ప్రదర్శించా రు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేయించిన భారీ కేక్‌ను కట్ చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇం ఛార్జ్ తలసాని సాయి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కా ర్యక్రమంలో ఎంఎల్‌సిలు ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, స్టీఫెన్ సన్, ఎంఎల్‌ఎ ముఠా గోపాల్, కార్పొరేషన్ చైర్మన్‌లు గజ్జెల నగేష్, కోలేటి దామోదర్ గుప్తా, అనిల్ కుమార్ కూర్మాచలం, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పలువురు మంత్రుల శుభాకాంక్షలు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌కు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ భగవంతుడి దీవెనలతో ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉం డాలని, ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఫోన్ ద్వారా మంత్రి కెటిఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడి దీవెనలతో ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరారు.అలాగే రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంత్రి కెటిఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష లు తెలిపారు.ఆరోగ్యంగా, సంతోషంగా, ప్రశాంతంగా ప్రజాసేవలో సుదీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.
కెటిఆర్‌పై అభిమానాన్ని చాటుకున్న ఆటోడ్రైవర్
మంత్రి కెటిఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని సోమవారం తన ఆటోలో ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు 51 మందికి ఐదు రూపాయల భోజనా న్ని అందించనున్నట్లు ఆటో డ్రైవర్, మంత్రి కెటిఆర్ వీరాభిమా ని గంధం ఆనంద్ తెలిపారు. జియాగూడ నుంచి అఫ్జల్‌గంజ్ వరకు తన ఆటోలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణ వసతిని కల్పించనున్నట్లు వివరించారు. మధ్యాహ్నం ఫిలింనగర్‌లోని అపోలో ఆసుపత్రి వద్ద ఉన్న జిహెచ్‌ఎంసి ఐదు రూపాయల భోజన కేంద్రం వద్ద తన డబ్బులతో 51 మందికి భోజనం చేయించనున్నట్లు పేర్కొన్నారు.
పైలెట్ కలకు ఎంఎల్‌ఎ సుంకె రవి శంకర్ చేయూత
మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఎంఎల్‌ఎ సుంకె రవిశంకర్ పైలట్ శిక్షణకు ఎంపికైన నిరుపేద కుటుంబానికి చెందిన నవ్యకు రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. కరీంనగర్ జిల్లా,గంగాధర మం డలం, గర్షకుర్తి గ్రామానికి చెందిన వేల్పుల నవ్య చదువులో అద్భుత ప్రతిభ కనబరుచుతూ పైలెట్ శిక్షణకు ఎన్నికయ్యా రు. ఫ్లయింగ్ శిక్షణ కోసం ప్రభుత్వం 36 లక్షల స్కాలర్షిప్ అందజేస్తుండగా, గ్రౌండ్ శిక్షణ కోసం రూ.3 లక్షలు నవ్య భరించవలసి ఉంటుంది. నిరుపేద కుటుంబం కావడంతో ఖ ర్చులు భరించే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో దాతల సహకారం కోసం ఎదురుచూస్తోంది.సామాజిక మాధ్యమాల్లో నవ్య గురించి వచ్చిన వార్తలను చూసిన చొప్పదండి ఎంఎల్‌ఎ సుం కె రవిశంకర్ నవ్యకు సాయం చేసేందుకు ముందుకు వచ్చా రు. కెటిఆర్ బర్త్ డే సందర్భంగా శిక్షణ కోసం రూ.50 వేలు అందజేయడంతో పాటు భవిష్యత్తులో నవ్యకు అన్ని విధాలా అండగా ఉంటానని రవిశంకర్ హామీ ఇచ్చారు.
కెటిఆర్‌కు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌కు ఆ పార్టీ నేత అలిశెట్టి అరవింద్ వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 12 అడుగుల ఎత్తు 45 అడుగుల వెడల్పు కలిగిన భారీ బస్సుకు ఇరువైపులా మంత్రి కెటిఆర్ సారథ్యం లో సా ధించిన విజయాలను వివరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. టీ హబ్, దుర్గం చెరువు ఫ్లైఓవర్, టీ వర్క్, నగరంలోని పలు ఫ్లైఓవర్లను ఇందులో పొందుపరిచారు. దేశంలోనే తొలిసారి గా ఈ తరహా శుభాకాంక్షలు తెలిపిన నేతగా అలిశెట్టి చరిత్ర లో నిలిచిపోనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన ఈ వాహనం సోమవారం ఉదయం 6 గంటల నుంచి పది రోజులపాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో సంచరించింది. మాటల్లో కాదు అతి తక్కువ కాలంలో అభివృద్ధిని చేసి చూపించిన తమ నేత కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నట్లు అలిశెట్టి పేర్కొన్నారు.
కేక్ కట్ చేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి
మంత్రి కెటిఆర్ పుట్టినరోజు సందర్భంగా బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో సోమవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులతో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహిస్తున్న కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మొక్కను నాటారు.
జపాన్‌లో కెటిఆర్ జన్మదిన వేడుకలు
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూతురు అక్షిత జపాన్‌లో మంత్రి కెటిఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. జపాన్‌లో తన సహోద్యోగులతో కలిసి అక్షిత కేక్ చేసి కెటిఆర్‌కు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షిత మాట్లాడుతూ…మంత్రి కెటిఆర్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఐటీ రంగంలో యువతకు ఉపాధి అవకాశాల కోసం మంత్రి కెటిఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. అలాగే ఖతర్‌లో కెటిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దోహాలో బిఆర్‌ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ అబ్బగౌని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 15 మంది బైక్ ఫుడ్ డెలివరీ బాయ్స్‌కు రూ.22 లక్షల ఉచిత జీవిత బీమా అందించారు.
టమాటాలు పంచిన ఎంఎల్‌ఎ ముఠా గోపాల్
మంత్రి జన్మదినం పురస్కరించుకొని ముషీరాబాద్ డివిజన్ పార్సిగుట్టలో ఎంఎల్‌ఎ ముఠా గోపాల్ టమాటాలను పంపిణీ చేశారు. రానున్న 2024 శాసనసభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ 105 స్థానాలు గెలుచుకుంటుందని సిఎం కెసిఆర్ ప్రకటించడంతో 105 కిలోల టమాటాలను కెటిఆర్ బర్త్ డే సందర్భంగా పేదలకు పంపిణీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News