Monday, May 6, 2024

రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు..

- Advertisement -
- Advertisement -

Heavy Rain

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, కర్ణాటక, గోవాల్లో రానున్న 24 గంటల నుంచి 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండి) హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘఢ్, ఒడిశా, మేఘాలయాల రాష్ట్రాలకు కూడా వర్ష సూచన ఉందని ఐఎండి తెలిపింది. అతి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండి అన్ని రాష్ట్రాలకు సూచించింది. బంగాళాఖాతంలోని పశ్చిమ-మధ్య వాయువ్య ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం రాబోయే కొద్ది రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి ఢిల్లీ, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. జూన్ 13వ తేదీ నుంచి 16 వరకు రాజస్థాన్‌లో వేడి తరంగాల పరిస్థితులతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.

1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం
నైరుతి రుతుపవనాలు క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంతో పాటు మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. నైరుతికితోడు ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలపడే అవకాశం ఉందని, ఈ రెండింటి ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

రాగల ఐదురోజులు గ్రేటర్ హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షాలు
ప్రధానంగా ఆదిలాబాద్, కుమ్రంభీంఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువొచ్చని అధికారులు పేర్కొన్నారురు. రాగల ఐదురోజులు గ్రేటర్ హైదరాబాద్ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

బలహీనపడిన అల్పపీడనం

ఉత్తర కోస్తా ఆంధ్ర దానిని ఆనుకొని ఉన్న కోస్తా ఒరిస్సా దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం శనివారం బలహీనపడిందని అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా ఉత్తర ఇంటీరియర్ ఒరిస్సా దాని పరిసర ప్రాంతాల్లో 7.6 కి.మీల ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉందని అధికారులు తెలిపారు. తూర్పు-పశ్చిమ shear zone 19.0 deg. Lat. వెంబడి 3.1 km ఎత్తు వద్ద పెని న్సులర్ మధ్య భారతదేశం మీదుగా 5.8 కి.మీల ఎత్తు వరకు కొనసాగుతోందని, ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఆది, సోమవారాల్లో కొన్ని చోట్ల మంగళవారం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Heavy Rains in next 48 hours in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News