Friday, April 26, 2024

రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు..

- Advertisement -
- Advertisement -

Heavy Rains in Telangana for next 24 hours

హైదరాబాద్‌ః అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలుచోట్ల రానున్న 24 గంటల్లో వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో గురువారం, శుక్రవారం రెండు రోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో జూన్‌లో సాధారణంకంటే అధికంగా వర్షాలు కురిశాయని, జులైలోనూ అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఇక, ఎపిలోనూ వచ్చే రెండు రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. కోస్తా, ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Heavy Rains in Telangana for next 24 hours

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News