Saturday, April 27, 2024

మరో రెండు రోజులు భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

Heavy rains in Telangana for next two days

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తం గా అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా మరో రెండు, మూడురోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లా ల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మ ల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తూర్పు పశ్చిమ షేర్ జోన్ 20 డిగ్రీల నార్త్ వెంబడి 3.1 కి.మీల నుంచి 5.8 కి.మీల ఎత్తు మధ్య కొనసాగుతోందని ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపునకు వంపు తిరిగి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Heavy rains in Telangana for next two days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News