Friday, April 26, 2024

నగరాన్ని వదలని వానలు

- Advertisement -
- Advertisement -

Heavy rains lash Hyderabad

భారీ వర్షం పడే అవకాశం ఉంది: వాతావరణ శాఖ

హైదరాబాద్: నగరవాసులను గత కొద్ది రోజులుగా వర్షం వెంటాడుతూనే ఉంది. ఎడతెరపి లేకుండా పడుతున్న చిరుజల్లులతో నగర వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో అనేక మంతి ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఒక వేళ ఎవైనా అత్యవసర పనులు ఉన్నా వారు వెంటనే తమ పనులను ముగించుకుని ఇంటికి చేరుకుంటున్నారు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వారు మాత్రం జల్లులకు తడిసి ముద్దవుతున్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు, పాదాచారులు చిరుజల్లులతో తడిచిపోతున్నారు. ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండటంతో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరో 24 గంటల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలలు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే వాతావరణఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడనం కారణంగా పశ్చిమ వాయువ్యదిశంగా కదిలి ఉదయం వాయుగుండంగా బలపడిందని తెలిపింది. ఈ వాయు గుండం పశ్చిమ వాయువ్యదిశగా 24 గంటల్లో దక్షిణ ఓడిశా,దక్షిణ చత్తీస్‌ఘడ్ మీదుగా వెళూతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News