Friday, May 3, 2024

నిండుకుండల్లా జంట జలాశయాలు

- Advertisement -
- Advertisement -

హిమయాత్‌సాగర్ గేట్లు ఎత్తివేతకు ఏర్పాట్లు
1763.50 అడుగులకు 1762 అడుగులకు చేరిన నీరు
మూసీ పరివాహక ప్రాంతాలను అలర్ట్ చేసిన అధికారులు
ప్రస్తుత నీటి నిల్వలకు మూడేళ్ల వరకు తాగునీటికి ఢోకాలేదంటున్న బోర్డు
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ నగరానికి తాగునీరు జలాలందించే జంట జలాశయాలు నిండుకుండల్లా తలపిస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వరద నీరు చేరు పెద్ద ఎత్తున చేరడంతో ఉస్మాన్‌సాగర్, హిమయాత్‌నగర్ ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. జలాశయం పైభాగంలో చేవెళ్ల, షాబాద్, వికారాబాద్ ప్రాంతంలో బారీ వానలు కురువడంతో ఇన్‌ప్లో పెరుగుతుంది. సోమవారం సాయంత్రం వరకు 277 క్యూసెకుల నీరు చేరుతుందని అధికారులు వెల్లడించారు. గడిచిన ఏడాదిలో కురిసిన వానలకు పదేళ్లు తరువాత 13 గేట్లు ఎత్తివేసి మూసీ ద్వారా దిగువ ప్రాంతాలకు నీరు వదలారు. తాజాగా కురుస్తున్న వానలకు ఇప్పటికే హిమయాత్‌సాగర్ జలాశయం పూర్తి నీటి మట్టంతో తొణికిసలాడుతుంది. ప్రాజెక్టు నీటి మట్టం 1763 అడుగులు ఉండగా నీటి సామర్దం 2.97 టిఎంసీలు కాగా ప్రస్తుత నీరు 2.631 టిఎంసీలు ఉన్నాయి. మళ్లీ వానకురిస్తే గేట్లు ఎత్తివేతిస్తామని, మూసీ సమీపంలో నివసించే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.

దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హిమయాత్‌సాగర్ నీటి మట్టం 1762.70 అడుగులకు చేరగానే దిగువ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ విధించనున్నారు. పోలీసు, రెవెన్యూ, జలమండలి అధికారులను స్దానిక ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. మూసీ వంతెల ఉన్న ప్రాంతంలో పోలీసులు భద్రత చర్యలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీసులు ప్రాజెక్టుపై పహారా కాస్తూ ఎప్పటికప్పుడు జలమండలి అధికారులు సమాచారం అందిస్తున్నారు. ఆదివారం చెరువు కట్టపై ఉన్న మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిమయాత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నీటి మట్టంపై తనిఖీలు చేస్తూ ఇన్‌ప్లో పెరిగితే గేట్లు ఎత్తివేసి దిగువ ప్రాంతాలకు నీటి వదులుతామని వాటర్‌బోర్డులు పేర్కొంటున్నారు. జంటజలాశయాల్లో నీటి సామర్దం సరిపడ ఉండటంతో మూడేళ్ల వరకు తాగునీటి ఇబ్బందులు ఉండవంటున్నారు.

Heavy water inflow to Himayat Sagar 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News